‘జంజీర్’ అఫీషియల్ ట్రైలర్ (వీడియో)
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే చరణ్ బాలీవుడ్లో పాతుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ స్టామినాకి బాలీవుడ్ జనాలు ఎన్ని మార్కులు వేస్తారో చూడాలి.
కాగా..'జంజీర్' ఎవరూ ఊహించని రేంజిలో రికార్డు స్థాయి రేటుకు అమ్ముడు పోయింది. ఈచిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ రూ. 105 కోట్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ సినిమాలకు తెలుగులో దాదాపు రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసే స్టామినా ఉండటం, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆయన సినిమాలకు మంచి మార్కెట్ ఉండటంతో పాటు, హిందీ మార్కెట్లో 'జంజీర్' చిత్రం అవలీలగా 80 కోట్లపైగానే వసూలు చేసే అవకాశం ఉండటంతో వంద కోట్లకు పైగా భారీ మొత్తానికి వెచ్చింది జంజీర్ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రిలయన్స్ సంస్థ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో జంజీర్ చిత్రాన్ని 'తుఫాన్' పేరుతో, మళయాలంలో 'ముంబై కా హీరో' పేరుతో విడుదల చేస్తున్నారు.
మరో వైపు 'జంజీర్' రిలీజ్ డేట్ ఖరారైంది. ఈచిత్రాన్ని సెప్టెంబర్ 06, 2013లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఈచిత్రం వేసవిలోనే విడుదల కావాల్సి ఉండగా ఈ చిత్ర నిర్మాతలు న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కోవడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రానికి సంబంధించిన లీగల్ సమస్యలు ఓ కొలిక్కి రావడంతో సినిమాను సెప్టెంబర్ 06న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా ముంబై నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి నిర్మాతలు మారినట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్ర నిర్మాతగా ఉన్న అమిత్ మెహ్రా నుంచి ఈ చిత్రాన్ని ఆయన సోదరులు సుమీత్, పునీత్‌లు సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు అడ్డంకులు తొలగినట్లే అంటున్నారు. ఈచిత్రంలో సెక్సీలేడీ ప్రియాంక చోప్రా హీరోయిన్. హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషించారు.


Click it and Unblock the Notifications











