రామ్ చరణ్ మూవీ టైటిల్ ‘ముంబై హీరో’
ఇప్పుడు రామ్ చరణ్ బాలీవుడ్ మూవీ 'జంజీర్' కూడా మళయాళంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు వెర్షన్‌కు ఇప్పటికే 'తుఫాన్' అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మలయాళ వెర్షన్‌కు 'ముంబై హీరో' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో రామ్ చరణ్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్. 1973లో అమితాబ్, జయాబచ్చన్ జంటగా నటించిన 'జంజీర్' చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. రామ్ చరణ్ ఈచిత్రంలో ఏసీపీ విజయ్ ఖన్నాగా...ఒరిజినల్ 'జంజీర్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రలో కనిపించబోతున్నారు. జయాబచ్చన్ పాత్రలో ప్రియాంక చోప్రా నటించింది.
హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషిస్తున్నారు. సినిమా కొన్ని లీగల్ వివాదాల్లో ఉన్నందువల్ల విడుదల ఆలస్యం అవుతోంది. మరో రెండు నెలల్లో ఈచిత్రం విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications












