చరణ్ ఫ్యాన్స్‌కు షాక్, సారీ చెప్పిన 'జంజీర్' దర్శకుడు
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రం 'జంజీర్'పై అభిమానులు భారీ అంచనాలు పెట్టున్నారు. ఈ సినిమా తొలి టీజర్ హైదరాబాద్ లో ఈ నెల 17న జరిగే సిసిఎల్-3 మ్యాచ్ సందర్భంగా విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించడంతో.....రామ్ చరణ్ బాలీవుడ్ లుక్ ఎలా ఉంటుదనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే అభిమానులందరినీ డిస్సప్పాయింట్ చేస్తూ ఆ చిత్ర దర్శకుడు అపూర్వ లఖియా ప్రకటన చేసారు. రేపు సిసిఎల్ 3 మ్యాచ్ సందర్భంగా 'జంజీర్' టీజర్ విడుదల చేయడం లేదని, అనుకున్న సమయానికి టీజర్ విడుదల చేయకపోవడం పట్ల క్షమాపణ చెబుతున్నట్లు ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి రీమేక్ గా రూపొందుతున్న 'జంజీర్' చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా, అమిత్ మిశ్రా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలు పోస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీ మొదటి ఏప్రిల్ లో అనుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని మే 10కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే మంచి ఫలితం వస్తుందని భావిస్తున్నారు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











