100 కోట్ల హీరోగా మారబోతున్న రామ్ చరణ్!
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీతో ఆయన రేంజి ఒక్కసారిగా హైరేంజికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల రామ్ చరణ్ ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో రెడ్ కార్పెట్‌పై నడిచే అవకాశం దక్కడానికి కారణం కూడా ఆయన బాలీవుడ్ ఎంట్రీనే అని చెప్పక తప్పదు. అఫ్ కోర్స్ ఆయన తండ్రి, కేంద్రమంత్రి చిరంజీవి కూడా చెర్రీకి కాన్స్ అవకాశం దక్కడానికి ఎంతో కొంత హెల్ప్ చేసే ఉంటారు లెండి! అది వేరే సంగతి.
అనతి కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో మంచి మార్కెట్ సంపాదించుకుని, అగ్రహీరోల్లో ఒకరిగా నిలిచిన రామ్ చరణ్ ఇప్పుడు 'జంజీర్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన మార్కెట్‌ను దేశం నలుమూలలా విస్తరించబోతున్నాడు. తద్వారా 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరోగా మారబోతున్నాడు.
ఈ మధ్య ఏ బాలీవుడ్ హిట్ సినిమా చూసినా వీజీగా 100 కోట్లు వసూలు చేస్తోంది. సౌత్ సినిమా మార్కెట్‌తో పెద్దగా సంబందాలు లేకుండా ఈ మొత్తం వసూలు చేస్తున్నాయి ఆ సినిమాలు. రామ్ చరణ్ జంజీర్ చిత్రం హిట్టయితే ఆ చిత్రం 100 కోట్ల వసూలు చేయడం చాలా సింపుల్ అంటున్నారు బాలీవుడ్ పండితులు.
రామ్ చరణ్ జంజీర్ చిత్రం సౌత్‌లో 'తుఫాన్' పేరుతో విడుదల కాబోతోంది. రామ్ చరణ్‌కు ఇప్పటికే సౌత్‌లో మంచి మార్కెట్ ఉండటం వల్ల......జంజీర్ చిత్రానికి 100 కోట్ల వసూలు కావడం పెద్ద కష్టమేమీ కాదనేది ట్రేడ్ వర్గాల అంచనా. త్వరలోనే మనం చరణ్ 100 కోట్ల ప్రస్తానాన్ని చూడబోతున్నామన్నమాట.
జంజీర్ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. చరణ్ సరసన ప్రియాంక చోప్రా హీరోయన్‌గా చేస్తుంది. గతంలో అమితాబ్ హీరోగా రూపొందిన 'జంజీర్' చిత్రానికి రీమేక్ గా ఈచిత్రం రూపొందుతోంది. ఆయిల్ మాఫియాకు, పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌కు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











