రూ. 25 కోట్లపై కన్నేసిన రామ్ చరణ్!

By Bojja Kumar

ముంబై: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'జంజీర్' అనే హిందీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం ద్వారా చెర్రీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రాబట్టే దిశగా దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రామ్ చరణ్ కు ఇటు తెలుగుతో పాటు దక్షిణాదిన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం, బాలీవుడ్ ప్రేక్షకులను ఆకర్షించే విధంగా ఈచిత్రంలో ప్రియాంక చోప్రాతో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ నటిస్తుండటం, ఇది అమితాబ్ నటించిన 'జంజీర్' చిత్రానికి రీమేక్ కావడంతో ఫస్ట్ డే భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నారు.

సాధారణంగా బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు తొలి రోజు 20 కోట్లపైనే వసూళ్లు సాధిస్తూ ఉంటాయి. ఇటీవల విడుదలైన సల్మాన్ ఖాన్ ఏక్ థా టైగర్ చిత్రం తొలి రోజు రూ. 35 కోట్ల పైచిలుకు రాబట్టింది. ఈనేపథ్యంలో రామ్ చరణ్‌కు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా జంజీర్ చిత్రానికి కనీసం రూ. 25 కోట్లు తొలి రోజు వస్తాయని అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా భారీగా థియేటర్లను కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం గతంలో బిగ్ బి అమితాబ్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ 'జంజీర్' చిత్రానికి రీమేక్.

అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. తాజా రీమేక్‌లో ఈ చిత్రంతో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం.

రామ్ చరణ్ ఈచిత్రంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' చిత్రంలో, వివి వినాయక్ దర్శకత్వంలో నాయక్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఈ మూడు చిత్రాలకు డేట్స్ అడ్జెస్ట్ చేసుకుంటూ తీరిక లేకుండా కష్ట పడుతున్నాడు చరణ్. తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవాలనే కసి రామ్ చరణ్‌లో కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X