twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాత మారాడు: ‘జంజీర్’ గట్టెక్కేనా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'జంజీర్' చిత్రానికి సమస్యలు తీరినట్లే కనిపిస్తున్నాయి. తాజాగా ముంబై నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈచిత్రానికి నిర్మాతలు మారినట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్ర నిర్మాతగా ఉన్న అమిత్ మెహ్రా నుంచి ఈ చిత్రాన్ని ఆయన సోదరులు సుమీత్, పునీత్‌లు సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సినిమా విడుదలకు అడ్డంకులు తొలగినట్లే అంటున్నారు.

    ఇదీ వివాదం...

    1973లో వచ్చిన 'జంజీర్' చిత్రం ఒరిజినల్ వెర్షన్‌ను ప్రకాష్ మెహ్రా 'ప్రకాష్ మెహ్రా ప్రొడక్షన్స్' బేనర్ పై నిర్మించారు. అతని పెద్ద కుమారుడైన అమిత్ మెహ్రాకు సంబంధించిన అడయ్ మెహ్రా ప్రొడక్షన్స్ ప్రై.లి రామ్ చరణ్ హీరోగా జంజీర్ చిత్రాన్ని రీమేక్ చేసింది. దీంతో అమిత్ సోదరులైన సుమీత్, పునీత్ రంగంలోకి దిగారు.

    తమ అనుమతి లేకుండా సినిమాను రీమేక్ చేసారని, తమ తండ్రిగారు నిర్మించిన ఆ సినిమాపై తమకూ హక్కులు ఉన్నాయని కోర్టుకెక్కారు. ఈ నేపథ్యంలో అమిత్ వారిద్దరికి తగిన మొత్తం చెల్లించడంలో విఫలం అయ్యారు. చివరకు జరిగిన సెటిల్మెంట్‌లో ఈ చిత్రం హక్కులు సుమీత్, పునీత్‌లు దక్కించుకున్నారు. త్వరలో వీరే రామ్ చరణ్ నటించిన జంజీర్ చిత్రాన్ని 'ప్రకాష్ మెహ్రా ప్రొడక్షన్స్' బేనర్‌పై, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా విడుదల చేయబోతున్నారు.

    వివాదం కొలిక్కి రావడంతో ఈచిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేసేందుకు దర్శకుడు అపూర్వ లఖియా ప్లాన్ చేస్తున్నారు. ఈచిత్రంలో సెక్సీలేడీ ప్రియాంక చోప్రా హీరోయిన్. హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషించారు.

    English summary
    The dispute between producer Amit Mehra and his two brothers Sumeet and Punit over the remake rights of films Zanjeer and Thoofan was finally solved. Sumeet and Puneet,will produce the remake as a joint venture under the banner Prakash Mehra Productions along with Reliance Entertainment and Flying Turtle.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X