రామ్ చరణ్ ‘జంజీర్’ రిలీజ్ డేట్ ఖరారు

By Bojja Kumar

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' రిలీజ్ డేట్ ఖరారైంది. ఈచిత్రాన్ని ఏప్రిల్ 12, 2013లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ చిత్ర నిర్మాతలు వెల్లడించారు. రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న ఈచిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు.

అమిత్ మిశ్రా ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో సంజయ్ దత్, సోనూసూద్, ప్రకాష్ రాజ్, మహిగిల్, అతుల్ కులకర్ణి ముఖ్య పాత్రలు పోస్తున్నారు. అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ చిత్రం రీమేక్ ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న చెర్రీకి కలిసొస్తుందని అభిమానులు భావిస్తున్నారు.

రామ్ చరణ్ ఇప్పటి వరకు బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం లేదు. కేవలం సౌత్ లో మాత్రమే మార్కెట్ కల్గిన చరణ్ తో ఇంత భారీ బడ్జెట్ సినిమా తీయడం వెనక ధైర్యం ఏమిటి? పెట్టిన డబ్బులు వస్తాయా? అనే ప్రశ్నకు ఆ చిత్ర దర్శకుడు ఇటీవల ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.

రామ్ చరణ్ కు తప్పకుండా బాలీవుడ్ లో మంచి భవిష్యత్ ఉంటుందని, చెర్రీ సెక్స్ అప్పీల్, పెర్ఫార్మెన్స్ టాలెంట్ వల్లనే తెలుగులో అనతి కాలంలోనే నిలదొక్కుకోగలిగాడు. బాలీవుడ్ లేడీస్ కూడా రామ్ చరణ్ సెక్స్ అప్పీల్‌కు ఫిదా అపోతారని నేను నమ్ముతున్నాను అని దర్శకుడు చెప్పుకొచ్చారు.

రామ్ చరణ్ సినిమాకు ఇంత బడ్జెట్ పెట్టడంపై మాట్లాడుతూ.... ఈ సినిమాను హిందీతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేస్తున్నాము. బాలీవుడ్ ప్రేక్షకులకు రామ్ చరణ్ పరిచయం లేదు కాబట్టి ఈ చిత్రంలో సంజయ్ దత్, అతుల్ కులకర్ణి, మహి గిల్ లాంటి నటులను తీసుకున్నాం. దీని వల్ల భారం మొత్తం రామ్ చరణ్ పైనే పడదు. భారీ తారగణం ద్వారా ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడతాయి. ఈ సినిమా హిట్టయితే రామ్ చరణ్ కు బాలీవుడ్లో తిరుగు ఉండదనే ఆశాభావం వ్యక్తం చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X