రామ్ చరణ్ 'జంజీర్' విడుదల తేదీ ఖరారు

By Srikanya

ముంబై: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా 'జంజీర్' విడుదల తేదీ ఫిక్సైంది. ఈ చిత్రం విడుదల తేదీ మొదటి ఏప్రియల్ లో అనుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని మే 10 కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తే మంచి ఫలితం వస్తుందని భావిస్తున్నారు.

గతంలో 'ముంబై సే ఆయా మేరా దోస్త్', 'ఏక్ అజ్‌నబీ', 'షూటవుట్ ఎట్ లోఖండ్‌వాలా' చిత్రాల్ని రూపొందించిన అపూర్వ లఖియా ఈ రీమేక్ కి దర్శకుడు. 1973లో సూపర్ హిట్ అయిన అమితాబ్ బచ్చన్ సినిమా 'జంజీర్'కు ఇది రీమేక్. రాంచరణ్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, అర్జున్ రాంపాల్, మహీ గిల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.

ఈ చిత్రంలో అమితాబ్ ఓ గెస్ట్ పాత్రలో కనిపించనున్నాడని బాలీవుడ్ సమాచారం. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ మెహ్రా నిర్మాత. ఈ రీమేక్‌లో అమితాబ్‌ అతిథి పాత్రలో కనపడటానికి అమితాబ్ ఆసక్తి చూపిస్తున్నాడని బాలీవుడ్‌ సమాచారం. ఈ విషయమై దర్శకుడు అపూర్వ లఖియా ని మీడియా సంప్రదించింది. ఆయన మాట్లాడుతూ ''అమితాబ్‌ మా సినిమాలో నటిస్తున్నారని ఇంకా అధికారికంగా చెప్పలేను. ఆయన్ని సంప్రదిస్తున్న మాట వాస్తవమే. బిగ్‌ బి ఆశీస్సులు లేకుండా ఈ సినిమాను తీయలేం'' అన్నారు.

జంజీర్ రీమేక్ లో రామ్ చరణ్.. విజయ్ గా కనిపించనున్నాడు.. మాలాగా ప్రియాంక చోప్రా, తేజగా ప్రకాష్ రాజ్ చేస్తున్నారు. ఇక షేర్ ఖాన్ పాత్రలో సంజయ్ దత్, మోనా గా మహీ గిల్ కనిపించి అలరించనున్నారు. ఆయిల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ కాలానికి తగినట్లు అప్ డేట్ చేసి స్క్రిప్టు రాసి మరీ తీస్తున్నట్లు దర్శకుడు అపూర్వ లఖియా చెప్తున్నారు. ఈ చిత్రాన్ని రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు అమిత్ మెహ్రా నిర్మిస్తున్నాడు. పాత 'జంజీర్' దర్శకుడు ప్రకాశ్ మెహ్రా కుమారుడే ఈ అమిత్. తన తండ్రి సాధించిన విజయాన్ని ఈ చిత్రంతో కొనసాగించలనుకుంటున్నాని చెప్తున్నాడు.

సంజయ్ దత్ ఈ చిత్రంలో విలన్ గా చేస్తున్నారు. అగ్నిపధ్ లో సంజయ్ దత్ అదరకొట్టడంతో నెగిటివ్ పాత్రకు ఆయనైతేనే సరిపోతాడని భావిస్తున్నారు. ఇక రామ్ చరణ్ మాత్రం తన తాజా చిత్రం నాయక్ ప్రమోషన్ హడావిడిలో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X