బద్దలుకొట్టే దమ్ముంది : తుఫాన్ ట్రైలర్‌పై అమితాబ్
ముంబై : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. నిన్న విడుదలైన ఈచిత్రం ట్రైలర్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ ట్రైలర్‌పై బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ వచ్చన్ స్పందించారు.
'జంజీర్ రీమేక్ సినిమాలో రికార్డులు బద్దులు కొట్టే స్టఫ్ ఉంది... సినిమా టీంకు నా అభినందనలు' అంటూ అమితాబ్ తన బ్లాగులో పేర్కొన్నారు. అమితాబ్ హీరోగా 1973లో వచ్చిన 'జంజీర్'చిత్రం హిట్ కావడంతో...అదే సినిమాను ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సెక్సీలేడీ ప్రియాంక చోప్రా హీరోయిన్. హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషిస్తున్నారు. సోనూసూద్ ఐపీఎల్ మ్యాచ్ లో గాయపడి షూటింగులో పాల్గొనే స్థితిలో లేక పోవడంతో అతని స్థానంలో శ్రీహరిని తీసుకున్నారు. సమ్మర్లో ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
అమితాబ్ అభిమానుల కోరిక మేరకు 'జంజీర్' చిత్రంలో ఆయనతో గెస్ట్ రోల్ చేయిస్తున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ తేజ్ ఇటీవల మీడియాకు వెల్లడించారు. అయితే హిందీ వెర్షన్ జంజీర్ వరకు మాత్రమే అమితాబ్ గెస్ట్ రోల్ పరిమితమని, తెలుగు వెర్షన్ 'తుఫాన్' లో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ రోల్ ఉండవచ్చనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











