రీమేక్ కాదు సీక్వెల్ అంటున్న రామ్ చరణ్
రామ్ చరణ్ తాజాగా హిందీ చిత్రం జంజీర్ ని రీమేక్ చేస్తాడంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ అమితాబ్ సూపర్ హిట్ ని ఇప్పుడు రీమేక్ చేయటం లేదని కేవలం సీక్వెల్ మాత్రమే చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు ముంబైకి చెందిన టాబ్లాయిడ్ ఓ న్యూస్ ఐటం ప్రచురించింది. వారు అందులో ఈ ఇరవై ఏడేళ్ల యూత్ ఐకాన్ జంజీర్ సీక్వెల్ చేయటానికి ఓకే చేసాడని ప్రచురించింది. అలాగే రామ్ చరణ్ కి చెందిన వారు దాన్ని కన్ఫర్మ్ కూడా చేసారు. త్వరలోనే ఆఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని చెప్పారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ కలిసి నటించిన'జంజీర్' 1974లో మే 11న విడుదలై జంజీర్ అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆ రోజుల్లోనే దాదాపు 5 కోట్లు వసూలు చేసి అమితాబ్‌కు యాంగ్రీ యంగ్‌మెన్‌గా తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది.
ఈ విషయమై కొద్ది రోజులు క్రితం రామ్ చరణ్ మాట్లాడుతూ..నేను చాలా స్క్రిప్టులు బాలీవుడ్ ఎంట్రీ కోసం విన్నాను. వాటిలో ఏదీ నన్ను ఎక్సైట్ చేయలేకపోయింది. నేను లవర్ బోయ్ గా బాలీవుడ్ లో ఎంట్రీ అవ్వదలుచుకోలేదు. జంజీర్ చిత్రం నాలో ఉన్న ట్యాలెంట్ ని వెలికి తీస్తుందనిపిస్తోంది. నన్ను కొత్తగా ప్రెజెంట్ చేస్తుందని నమ్మకం ఉంది అని అన్నారు. ఇక మిగతా వివరాలు చెప్పటానికి ఆయన ఆసక్తి చూపలేదు. ఈ జంజీర్ చిత్రం రీమేక్ ని రిలియన్స్ బ్యానర్ పై అమిత్ మెహ్రా నిర్మించనున్నారని, అపూర్వ లకియా దర్శకత్వంలో రూపొందనుందని తెలుస్తోంది.ఈ చిత్రం 2012 ఏప్రిల్‌లో సెట్స్‌పైకి వెళ్లనుందని చిత్ర వర్గాల సమాచారం.
ప్రస్తుతం రామ్ చరణ్ సంపత్ నంది దర్శకత్వంలో 'రచ్చ'సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రాన్ని ఎన్.వి. ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











