రామ్ చరణ్ ‘జంజీర్’ తెలుగు టైటిల్ ఖరారు!
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ 'జంజీర్'ను హిందీతో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. చెర్రీ ఇమేజ్‌తో పాటు సినిమాకు సూటయ్యే టైటిల్ కోసం ఇంతకాలం అన్వేషించిన చిత్ర దర్శక నిర్మాతలు తాజాగా 'జ్వాల' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇది గతంలో చిరంజీవి నటించిన చిత్ర టైటిల్ కావడంతో మంచి ఫలితాలను ఇస్తుందనే నమ్మకం చిత్ర యూనిట్ సభ్యుల నుంచి వ్యక్తం అవుతోంది.
ఈచిత్రంలో చెర్రీ యాంగ్రీ యంగ్‌మేన్‌గా నటిస్తున్నారు. పోలీసాఫీసర్‌గా పవర్ ఫుల్ ఫెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. మరి చెర్రీ అంత పవర్ ఫుల్ గా ఉన్నప్పుడు టైటిల్ కూడా పవర్ ఫుల్ గా ఉంటేనే బాక్సాఫీసు షేకవుతుంది. ఈ నేపథ్యంలో ఎగసిపడే నిప్పును గుర్తుకు తెచ్చే 'జ్వాల' టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో సెక్సీలేడీ ప్రియాంక చోప్రా హీరోయిన్. బిగ్ బి అమితాబ్ పాతికేళ్ల క్రితం నటించిన 'జంజీర్' చిత్రానికి ఇది రీమేక్. హిందీ వెర్షన్లో షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ పోషిస్తుండగా, తెలుగు వెర్షన్లో శ్రీహరి విలన్ షేర్ ఖాన్ పాత్ర పోషిస్తున్నారు. సోనూసూద్ ఐపీఎల్ మ్యాచ్ లో గాయపడి షూటింగులో పాల్గొనే స్థితిలో లేక పోవడంతో అతని స్థానంలో శ్రీహరిని తీసుకున్నారు. గతంలో మగధీర చిత్రంలోనూ శ్రీహరి 'షేర్ ఖాన్' పాత్ర చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అతని పాత్ర పేరు షేర్ ఖాన్ కావడం కాకతాళీయమే అయినా..... అతనిపై పాత్రపై సర్వత్రా ఆస్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











