twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూఎస్‌లో రామ్ చరణ్ ‘జంజీర్/తుఫాన్’ రికార్డ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన బాలీవుడ్ మూవీ 'జంజీర్', ఈచిత్రం తెలుగు 'తుఫాన్' అమెరికాలో కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో విడుదలకు సిద్ధం అవుతోంది. టాలీవుడ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ హీరో సినిమా కూడా విడుదల కానన్ని లొకేషన్లలో జంజీర్/తుఫాన్ విడుదలవుతోంది.

    'బ్లూస్కై సినిమాస్' సంస్థ ఈచిత్రాన్ని అమెరికాలో విడుదల చేస్తోంది. వారు చెప్పిన వివరాల ప్రకారం మొత్తం 170 లొకేషన్లలో సినిమాను విడుదల చేస్తున్నారు. న్యూయార్క్ మరియు న్యూజెర్సీ మెట్రో ఏరియాలోనే రికార్డు స్థాయిలో 17 స్క్రీన్లలో సినిమాను విడుదల చేస్తున్నారు.

    సెప్టెంబర్ 6న జంజీర్/తుఫాన్ విడుదలవుతోంది. రామ్ చరణ్ నటించని తొలి బాలీవుడ్ మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రామ్ చరణ్‌తో జతకడుతోంది. రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలు, ప్రియాంకతో చేసే రొమాంటిక్ సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి.

    రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.

    English summary
    Zanjeer and Thoofan is releasing around 170 locations in US as never seen before for any Tollywood hero. Just in New York and New Jersey metro area it is releasing 17 screens as the biggest and record release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X