twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంజయ్ దత్ జైలుకు...చిక్కుల్లో రామ్ చరణ్ సినిమా!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ జైలుకు వెళ్ల నుండటంతో సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. 1993 ముంబయి పేలుళ్ల కేసుకు సంబంధించి అక్రమాయుధాలు కలిగి ఉన్నందుకు సంజయ్‌కి సుప్రీం కోర్టు ఐదేళ్ల జైలు శిక్షను విధించింది. ఇప్పటికే పద్దెనిమిది నెలల జైలు శిక్ష అనుభవించి ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్న సంజయ్‌ని నాలుగు వారాల్లో కోర్టులో లొంగి పోవాల్సిందిగా కోర్టు గురువారం ఆదేశించింది. దీంతో ఆయన మిగిలిన మూడున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

    ఈ నేపథ్యంలో సంజయ్ దత్ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలతో పాటు, ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వీటిలో తెలుగు స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్' చిత్రం ఉండటం అభిమానులకు మరింత ఆందోళన కలిగిస్తోంది.

    జంజీర్ చిత్రం హిందీ వెర్షన్‌లో సంజయ్ దత్ షేర్ ఖాన్ పాత్రలో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికే పలు సీన్ల చిత్రీకరణ జరిగింది. ఇంకా చాలా వరకు షూటింగ్ జరుగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సంజయ్ దత్‌ను లొంగి పోవాల్సిందిగా కోర్టు ఆదేశించడంతో నిర్మాతల గుండెల్లో బాంబు పేలినట్లయింది. జైలుకెళ్లి ఆయన షూటింగులో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడితే కోట్లాది రూపాయల నష్టం ఏర్పడటం ఖాయం.

    మరో వైపు సంజయ్ దత్ తెలుగులో బాలకృష్ణ హిట్ చిత్రం లక్ష్మి నరసింహకు రీమేక్ గా హిందీలో 'పోలీస్ గిరి' అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి కెఎస్. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కెఎస్. రవికుమార్‌కు ఇదే తొలి బాలీవుడ్ సినిమా. దీంతో ఆయనతో పాటు, ఆ సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలు ఆందోళనలో పడ్డారు. సంజయ్ దత్ జైలు కెలితే ఈ చిత్రం అటకెక్కడం ఖాయం. ఇప్పటికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న 'పోలీస్ గిరి'పై చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేసారు. సంజయ్ జైలు కెళితే ఇప్పటి వరకు పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే..!

    English summary
    Mega Power Star Ram Charan Teja's Zanjeer in trouble with actor Sanjay Dutt being sentenced to five years in jail for the 1993 Mumbai blast case? These are questions that are propping up in the minds of the actor's fans. In fact, film goers are even debating the same on social networking sites and fan pages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X