జూ.కత్రినాకైఫ్ తెలుగులో ఎంట్రీ ఖరారు

By Srikanya

హైదరాబాద్ : జూ.కత్రినాకైఫ్ గా పేరు తెచ్చుకుని ఆమె పోలికలే ఉన్న జరీనాఖాన్ గుర్తుండే ఉంటుంది. సల్మాన్ ఖాన్ చిత్రం వీర్ లో అతని ప్రక్కన ఆమె చేసింది. అయితే ఒరిజనలే దొరుకుతున్నప్పుడు డూపిల్ కేట్ ఎందుకన్నట్లు ...ఆమెకు అక్కడ పెద్దగా డిమాండ్ లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో ఆమె తెలుగులో ఎంట్రీ కోసం ఇవ్వబోతోంది. సౌత్ లాంగ్వేజ్ ల మీద దృష్టి పెడుతోంది. తెలుగు తెరపై ఆమె కనిపించబోయే చిత్రం ఏమిటీ...ఎవరి ప్రక్కన నటించబోతోంది అంటే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శ్రీకాంత్‌ టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ‘జల్సారాయుడు' చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేయబోతోందని వినికిడి. ఈ మేరకు దర్సకుడు సుధీర్ రాజు మాట్లాడుతూ...ఆమెతో గత నెల రోజులుగా టచ్ లో ఉన్నానని,కథ విని చాలా ఎక్సైట్ అయినట్లు తెలియచేసారు. అయితే రెమ్యునేషన్ దగ్గరే బేరసారాలు జరుగుతున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. డబ్బు మ్యాటర్ సెట్ కాగానే ఆమె తెలుగు షూటింగ్ కు హాజరుకానుంది.

‘జల్సారాయుడు' వివరాల్లోకి వెళితే..

Zareen Khan Set for Tollywood Debut

చిత్ర నిర్మాత కొలన్ వెంకటేష్ మాట్లాడుతూ ‘‘మా సంస్థనుండి వస్తున్న మొదటి చిత్రం ‘జల్సారాయుడు'. ఈ టైటిల్ ఇటీవలే నా మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ చెప్పడం జరిగింది. చాలా బాగుందని చెప్పడంతో దర్శకుడు చెప్పిన కథకు వంద శాతం కరెక్ట్ టైటిల్ ఇది. ఇప్పటివరకూ ఫ్యామిలీ హీరోగా మంచి పేరున్న శ్రీకాంత్ ఈ చిత్రంతో అన్నివర్గాల వారినీ ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. మా కథ చెప్పిన వెంటనే శ్రీకాంత్ ఒప్పుకోవడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ చిత్రం మా సంస్థకు శుభసూచికంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను''అని అన్నారు.

దర్శకుడు సుధీర్‌రాజు మాట్లాడుతూ ‘‘మంచి కథ, మంచి కథనంతో మీముందుకు రాబోతున్నాను. ‘జల్సారాయుడు' టైటిల్ ప్రతి ప్రేక్షకుడికీ కనెక్ట్‌అయ్యే టైటిల్ ఇది. కొలన్ వెంకటేష్ మంచి అభిరుచి ఉన్న నిర్మాత. నాకు ఈ అవకాశం ఇచ్చిన కొలన్ వెంకటేష్‌గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నివర్గాల వారికీ నచ్చే అంశాలని ఈ చిత్రంలో పుష్కలంగా ఉంటాయి. పరిశ్రమలో ఉన్న సీనియర్ ఆర్టిస్టులతోబాటు అగ్ర టెక్నీషియన్లందరూ మా చిత్రానికి పని చేయబోతున్నారు. ఆ వివరాలన్నీ అతి త్వరలో వెల్లడిస్తాం'' అని అన్నారు.

వెంకటరమణ మూవీస్‌ పతాకంపై కొలన్‌ వెంకటేశ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘రయ్‌ రయ్‌' ఫేమ్‌ సిహెచ్‌. సుధీర్‌రాజు దర్శకుడు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ ‘‘ఇది చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. కథ వినగానే కొత్తగా ఉందనిపించింది. టైటిల్‌కు తగ్గట్లే నాది జల్సాగా తిరిగే పాత్ర'' అన్నారు. ఇందులో ముగ్గురు కథానాయికలు ఉంటారనీ, మరో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉందనీ దర్శకుడు సుధీర్‌రాజు చెప్పారు.

సత్యం రాజేశ్‌, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, హేమ, గీతాంజలి తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: విక్రమ్‌రాజ్‌, సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: కె. బుజ్జి, కూర్పు: ఎస్‌.బి. ఉద్ధవ్‌, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: సిహెచ్‌. సుధీర్‌రాజు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X