»   »  నా భర్తతో ఆమె డేటింగ్ చేసింది, కూతురులా ఎలా ట్రీట్ చేస్తాం?

నా భర్తతో ఆమె డేటింగ్ చేసింది, కూతురులా ఎలా ట్రీట్ చేస్తాం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో చేసిన కామెంట్స్ సంచలనం అయిన సంగతి తెలిసిందే. పదిహేనేళ్ల క్రితం ఆదిత్య పంచోలి వద్ద తాను ఉన్నపుడు తనను తీవ్రంగా హింసించాడని, కూతురు కంటే చిన్న వయసు ఉన్న, మైనర్ అయిన తనను రక్తం వచ్చేలా చావబాదాడని ఆరోపించింది.

ఆ సమయంలో తాను పంచోలి భార్య జరీనా హెల్ప్ కోసం వెళ్లానని, ఆమె కూడా తనకు సహకరించలేదని, పైగా తన భర్త ఇంటికి రాక పోవడంపై చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పిందని.... కంగనా సంచలన కామెంట్స్ చేశారు. కంగనా ఆరోపణలపై జరీనా స్పందించారు.

ఆమె నా భర్తతో డేటింగ్ చేసింది

ఆమె నా భర్తతో డేటింగ్ చేసింది

కంగనా తన భర్తతో నాలుగున్నర సంవత్సరాలు డేటింగ్ చేసింది. అలాంటపుడు ఆమెను కూతురుగా ఎలా ట్రీట్ చేస్తాం? అని జరీనా ప్రశ్నించింది.

తన హెల్ప్ కోసం రాలేదు

తన హెల్ప్ కోసం రాలేదు

తన భర్త ఆదిత్య పంచోలి హింసిస్తున్నాడంటూ కంగనా తన సహాయం కోరి ఎప్పుడూ రాలేదని, ఆమె ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. చాలా తక్కువ సందర్భాల్లో తాను కంగనాను కలిశానని జరీనా స్పష్టం చేశారు.

పబ్లిసిటీ కోసమే

పబ్లిసిటీ కోసమే

కంగనా తన తాజా సినిమా ‘సిమ్రన్' పబ్లిసిటీ కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని, 14, 15 సంవత్సరాల క్రితం జరిగినట్లు చెబుతున్న సంఘటనలు ఇపుడు తెరపైకి తేవాల్సిన అవసరం ఏమిటని జరీనా ప్రశ్నించారు.

కంగనా సిస్టర్ రంగోళి

కంగనా సిస్టర్ రంగోళి

అయితే కంగనా సిస్టర్ రంగోళి.... జరీనా వ్యాఖ్యలను ఖండించింది. తన భర్తతో మైనర్(కంగన) డేటింగ్ చేస్తున్నట్లు తెలిసినపుడు..... పెద్ద పెద్ద డైరెక్టర్లను కలవడానికి కంగనాకు బహుమతులు, ఎర వేయడం లాంటివి ఎందుకు చేశారని ప్రశ్నించారు.

పిచ్చి పట్టిందంటున్న పంచోలి

పిచ్చి పట్టిందంటున్న పంచోలి

మరో వైపు కంగనా ఆరోపణలను ఆదిత్య పంచోలి ఖండించారు. కంగనాకు పిచ్చి పట్టిందని, అందుకే అలా మాట్లాడుతోందని, ఇది ఇలానే కొనసాగితే ఆమెపై లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

English summary
Actress Zarina Wahab responded on the revelation of Kangana Ranaut that she was house arrested and abused while being in a relationship with Aditya Pancholi. Zarina Wahab questioned, 'How could she treat Kangana as her Daughter when she was dating her Husband for four-and-a-half years?'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu