For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్‌ అవసరం లేదంటున్న హాట్ లేడీ

    By Bojja Kumar
    |

    ఆ మధ్య కత్రినాకు, సల్మాన్ కు మధ్య పొరపొచ్చాలు రావడంతో..కత్రినాకు బుద్ది చెబుదామనే కారణంతో సల్మాన్ ఆమె పోలికలో ఉన్న జరీన్ ఖాన్ అనే అమ్మాయిని తన 'వీర్" సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం చేసిన విషయం తెలిసిందే. పాపం ఆ సినిమా ప్లాపు కావడంతో జరీన్ సినీ కెరీర్లో పెద్దగా గ్రోత్ లేకుండా పోయింది. సల్మాన్ ద్వారా తనకు హీరోయిన్ ఛాన్స్ రావడం ఏమోగానీ..అతనితో ఆమెకు 'సం"బంధం ఉందనే వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ వార్తలు అస్సలు రుచించడం లేదట జరీన్‌కు. అందుకే ఈ మధ్య సల్మాన్ ఖాన్ కు పూర్తిగా దూరంగా ఉంటోంది.

    ప్రస్తుతం జరీన్ మూడు బెడ్ రూమ్స్, ఓ కిచెన్ ఉన్న ఇంటి కోసం ముంబై బాంద్రా ప్రాంతంలో వెతుకుతోంది. తన మానాన తను కష్టపడి ఇల్లు వెతుక్కుంటుంటే... సల్మాన్ ఇల్లు వెతకడంలో తనకు సాయం చేస్తున్నాడు అంటూ ప్రచారం మొదలైంది. ఇలా ప్రతి దానికి తనకు సల్మాన్ తో లింకు అండగట్టడాన్ని ఇబ్బందిగా పీలవుతోంది ఈ అమ్మడు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ ఆంగ్ల ప్రతికతో మాట్లాడుతూ... ''సల్మాన్ కు సంబంధించిన ప్రశ్నలతో నన్ను వేధించొద్దు, సల్మాన్ తనకు మంచి స్నేహితుడు, అంతకు మించి ఏమీ లేదు, ప్రశాంతంగా ఇల్లు కూడా వెతుక్కోనివ్వడం లేదు ఈ మీడియా వాళ్లు, ఇల్లు వెతకడంలో నాకు సల్మాన్ అవసరం లేదు, ఆ పని నేను చేసుకోగలను"" అంటూ చిటపటలాడింది.

    జరీన్ త్వరలో రూపొందించబోతున్న 'హౌస్ ఫుల్" సినిమాలో నటించనుంది. దీంతో పాటు తమిళంలో హీరో విక్రమ్ సరసన కర్నీకరన్ సినిమాలో లీడ్ హీరోయిన్ రోల్ చేయబోతోంది.

    English summary
    Zarine Khan is in no mood to encourage rumors of her link up with Salman Khan as she is busy looking out for a suitable three bedroom kitchen apartment in Bandra, Mumbai.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X