twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాంబులా పేలిన 'RRR' శాటిలైట్ రైట్స్ ధర.. సంచలన డీల్, సగం బడ్జెట్ రికవరీ!

    |

    దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం అప్పుడే సంచలనాలు ప్రారంభించింది. కనీసం రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి కాలేదు. కానీ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శత్వం వహిస్తున్న చిత్రం కావడం, ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తుండడంతో సినిమాకు చిత్రీకరణ దశలోనే హైప్ పెరుగుతోంది. తాజాగా ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ గురించి సంచలన వార్త ప్రచారం జరుగుతోంది. రాజమౌళి సినిమాల స్థాయి ఏంటో తెలియజేసేలా ఉన్న ఈ వార్తకు సంబందించిన పూర్తి వివరాలు చూద్దాం..

    బాహుబలి తర్వాత

    బాహుబలి తర్వాత

    రాజమౌళి దర్శకత్వ ప్రతిభ ఏంటో బాహుబలి చిత్రంతో ప్రపంచం మొత్తం చూసింది. బాహుబలి చిత్రం సాధించిన విజయం, వసూళ్లతో దేశం మొత్తం రాజమౌళి గురించి చర్చించుకున్నారు. బాహుబలి తర్వాత అంతకంటే భారీ చిత్రాన్ని రాజమౌళి ప్రారంభించారు. రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దీనితో ఈ చిత్ర బిజినెస్ లో చిన్న అవకాశం కోసం అయినా బడా కార్పొరేట్ సంస్థలు ఎదురుచూస్తున్నాయి.

    బాంబులా పేలిన ధర

    బాంబులా పేలిన ధర

    ఆర్ఆర్ఆర్ చిత్ర బిజినెస్ విషయంలో కార్పొరేట్ సంస్థల మధ్య ఏస్థాయిలో పోటీ నెలకొని ఉందొ చెప్పడానికి ఈ వార్తే నిదర్శనం. ప్రముఖ జీ నెట్వర్క్ సంస్థ తెలుగు, తమిళ, హిందీ మూడుభాషల్లో శాటిలైట్ హక్కుల కోసం 150 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. భారత చలన చిత్ర రంగంలో ఇది రికార్డ్ శాటిలైట్ డీల్ అని చెప్పొచ్చు. ఇంకా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి కాకముందే టివి సంస్థలు ఆర్ఆర్ఆర్ శాటిలైట్ రైట్స్ కోసం ఎగబడుతున్నాయి.

    <strong>ఆర్ఆర్ఆర్ టైటిల్ ఇంత సింపులా.. మరో వైరల్ న్యూస్!</strong>ఆర్ఆర్ఆర్ టైటిల్ ఇంత సింపులా.. మరో వైరల్ న్యూస్!

    హోల్డ్‌లో ఉంచారు

    హోల్డ్‌లో ఉంచారు

    జీ నెట్వర్క్ ఇచ్చిన ఆఫర్ ని నిర్మాత డివివి దానయ్య ఒకే చేయలేదు. ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంచారట. ఇతర సంస్థల రెస్పాన్స్ చూసి రాబోవు రోజుల్లో శాటిలైట్ డీల్ ని క్లోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. పునర్జన్మల నేపథ్యంలో రాజమౌళి ఈ చిత్రాన్ని పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. నిన్ననే చిత్ర యూనిట్ ఆర్ఆర్ఆర్ సెకండ్ షెడ్యూల్ ని ప్రారంభించింది. ప్రస్తుతం షూటింగ్ లో రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ పాల్గొంటున్నారు.

    సగం బడ్జెట్ రికవరీ

    సగం బడ్జెట్ రికవరీ

    జీ నెట్వర్క్ తో ఇచ్చిన 150 కోట్ల ఆఫర్ తో డీల్ కుదిరితే ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలకు ముందే సగం బడ్జెట్ రికవరీ చేసినట్లు అవుతుంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నారు. ఎన్టీఆర్ దొంగగా, రాంచరణ్ పోలీసుగా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Zee network offers 150 cr to RRR satellite rights. Rajamouli directing this movie and Ram Charan, NTR are lead roles
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X