For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’కి షాకింగ్ రేటు....

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇ.వి.వి సత్య నారాయణ సమర్పణలో సిరి సినిమా పతాకంపై అల్లరి నరేష్-మోనాల్ గజ్జర్ జంటగా అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న చిత్రం ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి'. అల్లరి నరేష్‌కు ట్విన్ సిస్టర్‌గా ‘రంగం' ఫేం కార్తీక నటిస్తున్న ఈ చిత్రానికి ‘వీడు తేడా' ఫేం బి.చిన్ని దర్శకుడు. శేఖర్ చంద్ర సంగీత సారథ్యం వహించిన ఈ చిత్రంలోని ఒక పాటకు శ్రీవసంత్ స్వరాలందించారు.

    ఈ చిత్రం విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘బ్రదర్ అఫ్ బొమ్మాళి' శాటిలైట్ హక్కుల కోసం పలు ఛానల్స్ పోటీ పడగా...జీ తెలుగు అత్యధికంగా రూ. 4 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ చిత్రానికి శాటిలైట్ రైట్స్ ఈ రేంజిలో దక్కడం ఆశ్చర్య పరుస్తోంది.

     Zee Telugu bags 'Brother of Bommali's satellite rights

    నిర్మాత అమ్మిరాజు కానుమల్లి మాట్లాడుతూ...‘అల్లరి నరేష్-కార్తీక ట్విన్స్ గా నటించిన ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ' చిత్రంలో అల్లరి నరేష్ కామెడీతో పాటు...కార్తీక యాక్షన్ సీన్స్, డాన్స్ మూమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయి. ఆడియోతో పాటు సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది' అన్నారు.

    హర్షవర్ధన్ రాణె, బ్రహ్మనందం, ఆలి, జయప్రకాష్ రెడ్డి, నాగినీడు, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, అభిమన్యు సింగ్, కెల్లీ డార్జ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, సాహిత్యం: భాస్కరభట్ల, ప్రెస్ రిలేషన్స్: వంశీ-శేఖర్, ఎడిటర్: గౌతంరాజు, పోరాటాలు: రామ్-లక్ష్మణ్, ఛాయాగ్రహణం: విజయ్ కుమార్ అడుసుమిల్లి, కధ: విక్రమ్ రాజ్, కార్యనిర్వహక నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వర్రావు, నిర్మాత: అమ్మిరాజు కానుమల్లి, స్క్ర్రీన్ ప్లే-దర్శకత్వం: బి.చిన్ని.

    English summary
    Zee Telugu has bought the satellite rights of Comedy King Allari Naresh’s latest offering ‘Brother of Bommali’ for a whopping 4 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X