60 ఏళ్ల వయసులో పెళ్లిపై జీనత్ అమన్ స్పందన
దీంతో జీనత్ అమన్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని, తాను ఎవరినీ రెండో పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేసారు. ఈ వార్తలు విని షాకయ్యానని, తాను రెండో పెళ్లి చేసుకున్నట్లు ఎవరితోనూ చెప్పలేదు, మరి ఈ వార్త ఎలా ప్రచారంలోకి వచ్చిందో అర్థం కావడం లేదని, చాలా అప్ సెట్ అయ్యానని ఆమె చెప్పుకొచ్చారు.
1970-80ల్లో జీన్ అమన్ బాలీవుడ్ సెక్సీ హీరోయిన్గా ప్రఖ్యాతిగాంచింది. ఆమె నటించిన 'సత్యం శివం సుందరం', 'హరే రామ హరే కృష్ణ', 'యాదోంకి బరాత్', 'హమ్ కిసిసే కమ్ నహీ' చిత్రాలు బాలీవుడ్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. జీనత్ మొదటి భర్త మజార్ ఖాన్. ఆయన కూడా నటుడే. తరవాత విడిపోయారు. జీనత్‌కు అజాన్ (26), జహాన్ (23) అనే ఇద్దరు కుమారులున్నారు.
"పెళ్లి అనేది ఒక ఘోరమైన తప్పు.. ఆ తప్పు మళ్లీ చేయను'' అని కొన్నేళ్ల క్రితం ప్రకటించింది. అప్పుడు అలా ప్రకటించిన జీనత్ మళ్లీ మనసు మార్చుకుందేమోనని దేశ వ్యాప్తంగా ఆమె అభిమానులు గందరగోలానికి గురయ్యారు. ఈ వయసులో పెళ్లి ఏమిటని కొంత మంది విస్మయం వ్యక్తం చేసారు. తాజాగా అవన్నీ పుకార్లే అని తేలడంతో ఆశ్చర్యపోయారంతా.


Click it and Unblock the Notifications












