For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ టాపిక్ : తక్కువ వయస్సు వాడితో...ఆమెకు రెండో పెళ్లి

  By Srikanya
  |
  న్యూఢిల్లీ : నిన్నటి తరం హిందీ నటి జీనత్‌ అమన్‌ పేరు చెప్పగానే 'దమ్‌ మారో దమ్‌...' పాటే గుర్తుకొస్తుంది. 'హరేరామ హరేకృష్ణ'లోని పాట ఇది. ఆ సినిమాతోపాటు 'యాదోఁకీ బారాత్‌', 'సత్యం శివం సుందరం', 'ఖుర్బానీ', 'హీరాపన్నా' లాంటి చిత్రాలు స్ఫురిస్తాయి. హిందీ సినీప్రియులపై జీనత్‌ బలమైన ముద్ర వేశారు. ఇప్పుడామె వయసు 61 సంవత్సరాలు. త్వరలో ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ముంబయికి చెందిన ఓ యువ వ్యాపారవేత్త జీనత్‌కి కాబోయే భర్త అని తెలిసింది. అతని వయసు 36 సంవత్సరాలు.

  జీనత్‌ మొదటి భర్త మజార్‌ ఖాన్‌. ఆయన కూడా నటుడే. తరవాత విడిపోయారు. జీనత్‌కు అజాన్‌ (26), జహాన్‌ (23) అనే ఇద్దరు కుమారులున్నారు. వారు కూడా తమ తల్లి మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడంపై సంతృప్తిగా ఉన్నారని తెలిసింది. "దమ్ మారో దమ్..'', "చురాలియా హై తుమ్‌నేజో దిల్‌కో..'' అంటూ ఒకతరం ప్రేక్షకుల్ని తన హొయలతో ఉర్రూతలూగించిన జీనత్ అమన్ (62) లేటు వయసులో మళ్లీ పెళ్లికి సిద్ధమైంది. "పెళ్లి అనేది ఒక ఘోరమైన తప్పు.. ఆ తప్పు మళ్లీ చేయను'' అని కొన్నేళ్ల క్రితం ప్రకటించింది. అయితే మనస్సు మార్చుకుందో ఏమో.. ఆమె మరోసారి అదే 'తప్పు' చేయబోతోంది.

  వయసులో తనకన్నా 26 ఏళ్లు చిన్నవాడైన ముంబై వ్యాపార వేత్తతో ఏడడుగులు నడవబోతోంది. అతడి వయసు 36 ఏళ్లు. అతణ్ని తాను ఇటీవలే కలుసుకున్నానని, అతడు తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాడని ఆమె ప్రకటించింది. తాను చేసుకోబోయేవాడు భారతీయుడేనని చెప్పిన జీనత్.. అతడి గురించి ఇతర వివరాలు వెల్లడించలేదు.

  1971లో 'హల్‌చల్', 'హంగామా' సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన జీనత్.. 'హరే రామ హరే కృష్ణ' సినిమాతో రాత్రికిరాత్రి స్టార్ అయిపోయింది. 1985లో సహనటుడు మజర్‌ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు.. అజాన్ (26), జహాన్ (23). పెళ్లి గురించి తన కొడుకులిద్దరికీ చెప్పానని, తన నిర్ణయానికి వారెంతో ఆనందించారని వివరించింది.

  బాలీవుడ్‌లో గ్లామరస్‌ తారగా పేరొందిన జీనత్‌ అమన్‌ ఆ కాలంలో మిస్‌ ఇండియా అందాల పోటీలలో సెకండ్‌ రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత ఆమె 1970లో మిస్‌ ఆసియా పసిఫిక్‌ కిరీటాన్ని దక్కించుకున్నారు.అనంతరం గ్లామర్‌ ప్రపంచంలో వెనుదిరిగి చూడకుండా ముందుకు దూసుకుపోయారు. బాలీవుడ్‌లోకి ప్రవేశించి నాటి అందమైన తారల్లో అగ్రస్థానంలో నిలిచారు. పలు హిట్‌ సినిమాల్లో నటించి తన అందచందాలతో అందర్నీ మైమరపించారు. అందమైన తారగా వెలుగొందిన ఆమె నాడు పలువురు యువతులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆధునిక యుగంలో మహిళలు మారాల్సి ఉందని ఆమె గట్టిగా చెప్పేవారు.

  English summary
  Zeenat Aman, who has always created different standards in life and made her mark in Bollywood, is all set to surprise her fans again. According to the latest buzz, the actress at 60 is going to tie the knot again. The actress got married to Mazhar Khan in 1985 and had two sons Azaan and Zahaan. Zeenat went through troubled marriage and promised herself to never witness the courtship ever again after her husband passed away in 1998. However, life decided to spring a surprise on the actress and she met the man of her life.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X