twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హిందీ రీమేక్ కు భలే డిమాండ్

    By Srikanya
    |

    హిందీ నుంచి తెలుగుకు,తెలుగు నుంచి హిందీకి రీమేక్ లు అనే స్కీమ్ ఇప్పుడు జోరుగా నడుస్తోంది.అక్కడ ఏదైనా రిలీజై హిట్టైతే వెంటనే దాని రైట్స్ సొంతం చేసుకునేదాకా మన నిర్మాతలకు మనశ్సాంతి ఉండటం లేదు.తాజాగా ఆ లిస్టులో చేరిన చిత్రం 'జిందగీ నా మిలేగీ దోబారా'. దీనర్థం ఈ జీవితం మళ్లీ రాదు అని. సినిమా తెలుగు రీమేక్‌ హక్కుల కోసం పలువురు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

    హృతిక్‌రోషన్‌, కరీనాకపూర్‌ జంటగా జోయా అక్తర్‌ దర్శకత్వంలో రూపొందిన 'జిందగీ నా మిలేగి దోబారా' ఇప్పటికే రూ.100 కోట్లు కలెక్ట్‌ చేసింది. మరో 100 కోట్లు కలెక్ట్‌ చేస్తుందని బాలీవుడ్‌ పండిట్స్‌ అంచనా వేస్తున్నారు.'బుడ్డా' సినిమా ద్వారా హిందీ ఫీల్డ్‌లో మంచి పరిచయాలు పెంచుకున్న పూరి జగన్నాథ్‌ ద్వారా కొందరు, పూరి జగన్‌ కంటే ముందు నుంచీ హిందీ పరిచయాలు విస్త్రతంగా కలిగిన కోన వెంకట్‌ ద్వారా మరికొందరు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.నిజానికి ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలని మన హీరోలు పోటీ పడటమే ఈ చిత్రం రీమేక్ చేయాలని నిర్మాతలు పరుగెట్టడానకి కారణం.

    English summary
    Zindagi Na Milegi Dobara is a 2011 Bollywood coming-of-age road film, directed by Zoya Akhtar and produced by Farhan Akhtar and Ritesh Sidhwani of Excel Entertainment. The story follows three friends - Arjun, Imraan and Kabir, who set off on an adventure in Spain, that make them iron out their differences and teach them to seize the day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X