twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    12th Man review మెప్పించిన మోహన్‌లాల్.. ఆకట్టుకోలేకపోయిన దృశ్యం డైరెక్టర్

    |

    Rating:
    2.5/5

    నటీనటులు, మోహన్ లాల్, లియోనా లిషోయ్, సంజూ కురుప్, ఉన్ని ముకుందన్, అను సితార, అనుశ్రీ, అనుమోహన్, రాహుల్ మహదేవ్, అదితి రవి, ప్రియాంక నాయర్ తదితరులు
    దర్శకత్వం: జీతూ జోసెఫ్
    రచన: కేఆర్ కృష్ణ కుమార్
    కథ: సునీర్ ఖేతర్‌పాల్
    నిర్మాత: అంటోని పెరంబవూర్
    సినిమాటోగ్రఫి: సతీష్ కురుప్
    మ్యూజిక్: అనిల్ జోసెఫ్
    ఎడిటింగ్: వీఎస్ వినాయక్
    బ్యానర్: ఆశీర్వాద్ సినిమాస్
    ఓటీటీ రిలీజ్: డిస్నీ+హాట్ స్టార్
    ఓటీటీ రిలీజ్ డేట్: 2022-05-20

    12th Man కథ ఏమిటంటే?

    12th Man కథ ఏమిటంటే?

    చంద్రశేఖర్ (మోహన్ లాల్) డ్యూటీలో మద్యం సేవించి జర్నలిస్టును కొట్టిన వ్యవహారంలో సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్. క్రైమ్ బ్రాంచ్‌లో విధులు చేపట్టడానికి ముందు హిల్ బేస్‌డ్ రిసార్డుకు వెళుతాడు. అక్కడకి బ్యాచ్‌లర్ పార్టీ జరుపుకొనేందుకు 11 మంది క్లాస్‌మేట్స్ రాగా వారితో పరిచయం ఏర్పడుతుంది. అయితే అనూహ్య పరిస్థితుల్లో షైనీ అనే యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తుంది.

    కథలో ట్విస్టులు ఇలా..

    కథలో ట్విస్టులు ఇలా..

    తన క్లాస్‌మెట్‌తో జితేష్‌కు ఉన్న అక్రమ బంధం బ్యాచ్‌లర్ పార్టీలో ఎలాంటి చిచ్చు రేపింది? షైనీ మరణానికి కారణం ఎవరు? షైనీ ఎలాంటి పరిస్థితుల్లో మరణించింది? షైనీ మరణం కేసులో చంద్రశేఖర్ ఎందుకు జోక్యం చేసుకొన్నాడు? చంద్రశేఖర్ చేసిన దర్యాప్తు ఎవరిని దోషిగా నిరూపించింది? ఈ మర్డర్ మిస్టరీకి చంద్రశేఖర్ దర్యాప్తు ఎలాంటి ముగింపును ఇచ్చింది అనే ప్రశ్నలకు సమాధానమే 12th Man మూవీ కథ.

    జీతూ జోసెఫ్ నుంచి మూవీ

    జీతూ జోసెఫ్ నుంచి మూవీ

    దృశ్యం, దృశ్యం2 లాంటి గొప్ప అనుభూతిని గురిచేసే సినిమాలను అందించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకుడు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రూత్ అండ్ డేర్ అనే గేమ్ ఆధారంగా ఈ సినిమా కథను నడిపించాడు. ఆధునిక యుగంలో మనుషుల జీవితాల్లో పెరిగిన మొబైల్ ఫోన్ల ప్రాధాన్యం, దాని వల్ల ఓ కేసు దర్యాప్తులో దానిని ఎలా ఉపయోగించుకోవచ్చనే కోణంలో కథనాన్ని కొనసాగించాడు. 11 మంది జీవితాల్లో కనిపించని చీకటి కోణాలు.. అవి షైనీ మరణానికి ఎలా దారి తీసాయనే విషయాలను డైలాగ్ డెలీవరిగా ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశారు.

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    ఫస్టాఫ్ ఎలా ఉందంటే?

    ఆర్తీగా అదితి రవి, ఫిదాగా లియోనా లిషోయ్‌, డాక్టర్ నయనగా శివదాగా , యానీగా ప్రియాంకగా, మెరిన్‌గా అను సితార, సిద్దార్థ్‌గా అను మోహన్, షైనీగా అను శ్రీ, జకారియగా ఉన్ని ముకుందన్, సామ్‌గా రాహుల్ మహాదేవ్, మ్యాథ్యూ సజ్జూ కురుప్2గా నటించారు. జితేష్ పెళ్లికి ముందు రిసార్టులో ఏర్పాటు చేసిన బ్యాచ్‌లర్ పార్టీ వరకు కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. ఎప్పుడైతే జితేష్‌కు తన గ్రూపులోని యువతికి అక్రమ సంబంధం, ప్రెగ్రెన్సీ అయిందనే విషయం బయటపడిందో అప్పటి నుంచి కథ, కథనాల్లో కదలిక వస్తుంది. షైనీ మర్డర్ తర్వాత మోహన్ లాల్ పాత్ర యాక్టివ్‌గా మారడంతో కథలో చలనం మొదలవుతుంది. ఫస్టాప్ కొంత నీరసంగా, కొంత ఆసక్తిగా కనిపిస్తుంది.

    సెకండాఫ్‌లో చెలరేగిన మోహన్‌లాల్

    సెకండాఫ్‌లో చెలరేగిన మోహన్‌లాల్

    ఇక సెకండాఫ్‌లో మొబైల్ ఫోన్ల ద్వారా షైనీ మరణంలో పాత్ర ఎవరిదనే గేమ్‌ కొత్తగా అనిపిస్తుంది. పూర్తిగా డైలాగ్ డ్రామా కావడంతో కొన్నిసార్లు విసుగుపుడుతుంది. కాకపోతే మోహన్ లాల్ బాడీ లాంగ్వేజ్, ఫెర్ఫార్మెన్స్ సినిమాపై ఆసక్తి పెంచుతుంది. బ్యాచ్‌లర్ పార్టీకి వచ్చిన 11 మందితో కలిసి 12వ వ్యక్తిగా దర్యాప్తు ఎలా చేశారనేది ఈ సినిమా ముగింపు. అయితే గత సినిమాల మాదిరిగా జీతూ జోసెఫ్ మ్యాజిక్ కనిపించదు. సింగిల్ పాయింట్‌ చుట్టు అల్లుకొన్న కథ కావడం వల్ల ఆద్యంతం సీరియస్‌గా సాగుతుంది. వినోదానికి ఎలాంటి స్కోప్ లేకపోవడం తెలుగు వారికి నచ్చకపోవడానికి అవకాశాలు ఉన్నాయి.

    మరోసారి కొత్తగా మోహన్‌లాల్

    మరోసారి కొత్తగా మోహన్‌లాల్

    12th Man మూవీలో మోహన్‌లాల్ తప్ప మరొకరు చేసి ఉంటే.. అంతగా మెప్పించేది కాదేమో అనిపిస్తుంది. మద్యానికి అలవాటు పడి భార్యతో విడిపోయిన సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్‌గా మోహన్ లాల్ కొత్తగా కనిపించాడు. సెకండాఫ్‌లో మోహన్‌లాల్ అద్భుతంగా కనిపిస్తాడు. డామినేటింగ్ క్యారెక్టర్‌తో వన్ మ్యాన్ షో మాదిరిగా అనిపిస్తాడు. అయితే ఇతర క్యారెక్టర్లలో బలం లేకపోవడం వల్ల కథ, కథనాలు అంతగా ఆకట్టుకొన్నట్టు కనిపించవు.

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సతీష్ కురుప్ సినిమాటోగ్రఫి బాగుంది. అనిల్ జోసెఫ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు లేకపోవడం కొంత మైనస్ అనిచెప్పవచ్చు. వినాయక్ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. ఆంటోని పెరంబవూర్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. సింగిల్ లోకేషన్‌లో కథను నడిపించడం వల్ల తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ క్వాలిటీని అందించారని చెప్పవచ్చు.

    ఫైనల్‌గా 12th Man ఎలా ఉందంటే?

    ఫైనల్‌గా 12th Man ఎలా ఉందంటే?

    12th Man సినిమా విషయానికి వస్తే.. 12 మంది జీవితంలో చోటుచేసుకొన్న భావోద్వేగాలకు తెర రూపం ఈ చిత్ర కథ. ఆధునిక సమాజంలో అక్రమ సంబంధాలు, పార్టీలు, జల్సాల అంశాల నేపథ్యంగా జీతూ జోసెఫ్ తెరకెక్కించారు. ఎక్కువ అంచనాలతో సినిమా చూస్తే కొంత నిరాశను కలిగిస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే మోహన్ లాల్ ప్రేక్షకుడిని సంతృప్తి పరుస్తాడు. డిస్నీ+హాట్ స్టార్ ఓటీటీలో ఉంది కనుక.. వారాంతంలో గానీ.. లేదా సమయం చిక్కినప్పుడు ఓ థ్రిల్లర్ సినిమాను చూశామనే సంతృప్తి దక్కుతుంది.

    English summary
    Drishyam movie fame, Director Jeethu Joseph's latest movie 12th Man. Mohanlal and Unni Mukundan are in lead roles. This movie released on Disney+Hotstar OTT on May 20th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X