13 ఏళ్ల కుర్రాడు చేసిన క్రైమ్.. ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన స్పెషల్ సిరీస్.. ఎందులో?

ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఎంటర్టైన్మెంట్ పరంగా ఉన్న బిగ్గెస్ట్ ప్లాట్ ఫామ్ లలో ఓటిటిలు తీసుకున్న టేకోవర్ అంతా ఇంతా కాదు. భాషలతో కూడా సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు సిరీస్ లు సంచలనం సెట్ చేస్తాయి. కాగా ఇలాంటి సినిమాలు సిరీస్ లు అందించడంలో వరల్డ్ వైడ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఎపుడు కూడా ముందు వరుసలో ఉంటుంది.

ఇలా వరల్డ్ వైడ్ సెన్సేషన్ సెట్ చేసిన పలు వెబ్ సిరీస్ లు మనీ హేస్ట్, అలాగే స్క్విడ్ గేమ్, డార్క్ ఇంకా ఎన్నెన్నో నెట్ ఫ్లిక్స్ నుంచి వచ్చి గ్లోబల్ సక్సెస్ ని అందుకున్నాయి. కాగా ఇలా వాటి నుంచి వచ్చిన మరో సంచలన సిరీస్ నే 'అడోలసెన్స్'. తెలుగులో కౌమార దశ గా వినిపించే ఈ సిరీస్ కేవలం అంటే కేవలం నాలు ఎపిసోడ్స్ గా మాత్రమే చిన్న మినీ సిరీస్ లా వచ్చింది.

13 years old kid makes crime netflix series Adolescence creating sensation

అయినప్పట్టికీ ఎందుకు ప్రపంచ వ్యాప్తంగా ఇంత సంచలనంగా మారింది అంటే అందులో కంటెంట్ కోసమే అని చెప్పవచ్చు. దాదాపు ఒకో గంట ఎపిసోడ్ గా ఈ సిరీస్ ఉంటుంది. మీరు నమ్ముతారా ఈ ప్రతీ ఎపిసోడ్ కూడా కేవలం సింగిల్ టేక్ లో అందరు ఆర్టిస్ట్ లతో చేసింది అంటే? కానీ ఇది నిజమే మొత్తం గంట సేపు ఎపిసోడ్ ని మేకర్స్ సింగిల్ టేక్ ఎపిసోడ్ గా తెరకెక్కించారు.

ఈ టేకింగ్ కి ప్రపంచ ప్రముఖ సంస్థలు క్రిటిక్స్ దాసోహం అయితే ఇందులో కంటెంట్ కూడా అంతే హార్డ్ హిట్టింగ్ గా ఉండేసరికి నెట్ ఫ్లిక్స్ హిస్టరీలోనే భారీ రెస్పాన్స్ అందుకున్న సిరీస్ లలో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఇంతకీ ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే ఒక 13 ఏళ్ల స్కూల్ పిల్లాడు తన తోటి స్టూడెంట్ ఒక అమ్మాయిని మర్డర్ చేస్తాడు. ఆ క్రైమ్ ఎలా సాగింది.

అందులో ఫ్యామిలీ ఎమోషన్స్ ఏంటి ఆ అరెస్ట్, ఇన్వెస్టిగేషన్ లాంటి అంశాలు ఈ సిరీస్ లో నాలుగు ఎపిసోడ్స్ చూపించారు. అలానే చాలా మందికి తెలియని కొన్ని విషయాలు కూడా ఈ సిరీస్ లో చూపించడంతో కట్ చేస్తే కేవలం ఈ సిరీస్ వచ్చిన కొన్ని రోజుల్లోనే 20 మిలియన్ కి పైగా వ్యూస్ అందుకొని వరల్డ్ వైడ్ ట్రెండింగ్స్ లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది.

ఇంకా ఈ సిరీస్ ని అయితే ప్రస్తుత జెనరేషన్ లో తల్లిదండ్రులు అప్పుడప్పుడే యుక్త వయస్సుకి వస్తున్నా పిల్లలు తప్పకుండా చూడాలని చాలా మంది రికమెండ్ చేస్తున్నారు. అంతే కాకుండా మన టాలీవుడ్ సినిమా ప్రముఖ దర్శకుడు దేవా కట్ట ప్రస్థానం, రిపబ్లిక్ లాంటి హార్డ్ హిట్టింగ్ సినిమాలు తెరకెక్కించిన తాను కూడా ఈ సిరీస్ అద్భుతంగా ఉంది తప్పకుండా చూడండి అంటూ తెలుపుతున్నారు. కాగా ఈ మినీ సిరీస్ ని నెట్ ఫ్లిక్స్ ఒక్క ఇంగ్లీష్ లోనే కాకుండా తెలుగు సహా ఇతర పాన్ ఇండియా భాషల్లో కూడా తీసుకొచ్చింది. మరి చూడాలి అనుకుంటే నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ వీకెండ్ కి పనికొస్తుంది. ట్రై ఇట్.

More from Filmibeat

Read more about: netflix
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X