This Week OTT Movies : ఓటీటీలోకి ఒక్క రోజే 16 చిత్రాలు.. ఆ చిత్రాలు మీరు చూశారా?
తండేల్.. అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన లేటేస్ట్ ఫిల్మ్ ఇది. చందూ మొండేటీ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాసు నిర్మించారు. ప్యూర్ లవ్, యాక్షన్, దేశభక్తి గల ఈ చిత్రం మార్చి 7నుంచే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
మనమే.... శర్వానంద్ - కృతి శెట్టి జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా 'మనమే'. ఈ చిత్రం గతేడాది 2024 జూన్ 7నే విడుదలైంది. ఆరు నెలల తర్వాత ఓటీటీలో వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ జరుగుతోంది.

లైలా... విశ్వక్ సేన్ - ఆకాంక్ష శర్మ జంటగా నటించిన రీసెంట్ ఫిల్మ్ 'లైలా' ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేట్రికల్ రన్ ముగిశాక.. ప్రస్తుతం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. మార్చి 7 నుంచే ఆహా, ప్రైమ్ వీడియోలో ఆడియెన్స్ కు అందుబాటులో ఉంది.
బాపు... టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తాజాగా నటించిన చిత్రం 'బాపు'. ఈ చిత్రం కూడా మార్చి 7నుంచి జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ అవుతోంది.
ఉత్సవం.. రెజీనా కసాండ్రా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఉత్సవం కూడా ఓటీటీ లోకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. సన్ నెక్ట్స్ లో ఈ చిత్రం కూడా మార్చి 7 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది.
కుళంతైగల్ మున్నేట్ర కళగం... తమిళ స్టార్ కమెడియన్, నటుడు యోగి బాబు నటించిన లేటెస్ట్ ఫిల్మ్ కుళంతైగల్ మున్నేట్ర కళగం. మార్చి7 నుంచి ఈ చిత్రం 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ జరుగుతోంది.
ఫైండర్ ప్రాజెక్ట్ 1... తమిళంలో రీసెంట్ గా వచ్చి ఆడియెన్స్ ను థియేటర్లలో థ్రిల్ చేసిన చిత్రం 'ఫైండర్ ప్రాజెక్ట్ 1'. ఈ చిత్రంలో చార్లీ, సెండ్రయా ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 7నుంచి ఈ ఫిల్మ్ కూడా 'ఆహా తమిళం' ప్లాట్ ఫాంలో స్ట్రీమింగ్ జరుపుకుంటోంది.
కుడుంబస్తాన్.... తమిళంలో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ 'కుడుంబస్తాన్'. కే మనికందన్ ప్రధాన పాత్ర పోషించారు. కాగా ఈ చిత్రం మార్చి 7నుంచే జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
రేఖాచిత్రం... అసిఫ్ అలీ ప్రధాన పాత్రలో వచ్చిన థ్రిల్లర్ ఫిల్మ్ ఇది. మలయాళ భాషలో విడుదలై మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం కూడా మార్చి 7నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
నారాయణంటే మూన్నాన్మక్కల్... మలయాళ నటుడు, అఖిల్ 'ఏజెంట్' విలన్ ప్రధాన పాత్రలో నటించిన మాలీవుడ్ ఫిల్మ్ నారాయణంటే మూన్నాన్మక్కల్. మార్చి 7 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ది సీక్రెట్ ఆఫ్ విమెన్... మలయాళం ఎమోషనల్ థ్రిల్లర్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక కన్నడ చిత్రం
గానా... కన్నడ చిత్రం గానా ఇటీవల థియేటర్లను ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఈ చిత్రం సన్ నెక్ట్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో మార్చి 7 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. సైఫ్ థ్రిల్లర్ కు మంచి రెస్పాన్స్ దక్కుతోంది.
ఫతే.. రియల్ హీరో సోనూసూద్ తొలిసారి దర్శకత్వం వహించి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఫతే. ఈ యాక్షన ప్యాక్డ్ ఫిల్మ్ ప్రస్తుతం జీయోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
నదానియన్... ఖుషి కపూర్, ఇబ్రహాం అలీఖాన్ నటించిన లేటెస్ట్ హిందీ ఫిల్మ్ నదానియన్. ఈ చిత్రం కూడా మార్చి 7 నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో అవైలెబుల్ గా ఉంది.
దుపాహియా S1... హిందీ టీవీ సిరీస్ దుపాహియా సీజన్ 1 ప్రస్తుతం ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక హిందీలో వచ్చిన మరో సిరీస్ 'ది వేకింగ్ ఆఫ్ ఏ నేషన్ సీజన్1' సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











