twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    18 Pages OTT: ఒకేసారి రెండు ఓటీటీల్లో 18 పేజెస్.. ఎప్పుడు రిలీజ్ కాబోతుందంటే!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో మంది యంగ్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే, అందులో కొందరు మాత్రమే తమదైన చిత్రాలతో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌తో దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. సినిమా సినిమాకూ వేరియేషన్ చూపిస్తోన్న అతడు.. ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఈ జోష్‌లోనే ఆ వెంటనే '18 పేజెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

    <strong>హీరోయిన్ హన్సిక అందాల ఆరబోత: పెళ్లైన కొత్తలోనే ఊహించని విధంగా హాట్ షో</strong>హీరోయిన్ హన్సిక అందాల ఆరబోత: పెళ్లైన కొత్తలోనే ఊహించని విధంగా హాట్ షో

    ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో రూపొందిన '18 పేజెస్' మూవీ గత డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. అలా దాదాపు రెండు వారాల పాటు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇలా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా చేరుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. దీనికితోడు ముందే ప్రాఫిట్స్‌ను అందుకున్న ఈ చిత్రం నిర్మాతలకు కొన్ని కోట్ల లాభాలను తెచ్చి పెట్టింది. ఈ సినిమా ఫలితంతో చిత్ర యూనిట్‌తో పాటు నిఖిల్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

    18 Pages Movie Streaming on Aha and Netflix From January 27th

    థియేటర్లలో దాదాపు రెండు మూడు వారాల పాటు ఓ రేంజ్‌లో సందడి చేసిన నిఖిల్ '18 పేజెస్' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ, అలా మాత్రం జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. అలాగే, నిర్మాత సంస్థకు చెందిన ఆహాలో ఈ చిత్రాన్ని ఒకేసారి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ జనవరి 27వ తేదీ నుంచి ఈ రెండు ఓటీటీ సంస్థల్లో స్ట్రీమింగ్ అవబోతున్నట్లు తెలిసింది.

    బీచ్‌లో రెచ్చిపోయిన జబర్ధస్త్ రీతూ: హాట్ షోలో గీత దాటి లోపలివి కూడా చూపిస్తూ!బీచ్‌లో రెచ్చిపోయిన జబర్ధస్త్ రీతూ: హాట్ షోలో గీత దాటి లోపలివి కూడా చూపిస్తూ!

    నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా చేసిన చిత్రమే '18 పేజెస్'. పల్నాటి సూర్య ప్రతాప్ రూపొందించిన ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీలో దినేష్ రాజ్, అజయ్, పోసాని, బ్రహ్మాజీలు కీలక పాత్రల్లో నటించారు. దీనికి గోపీ సుందర్ సంగీతం అందించాడు.

    English summary
    Nikhil Siddhartha Did 18 Pages Movie Under Palnati Surya Pratap Directions. This Movie Streaming on Aha and Netflix From January 27th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X