twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    18 Pages OTT: రెండు ఓటీటీల్లో 18 పేజెస్ స్ట్రీమింగ్.. థియేటర్ల కంటే ఎక్కువగానే!

    |

    విలక్షణమైన నటనతో పాటు వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్. కెరీర్ ఆరంభం నుంచీ తనదైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఎన్నో విజయాలను కూడా సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది వచ్చిన 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా రేంజ్‌లో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఉత్సాహంతోనే గత డిసెంబర్‌లో నిఖిల్ సిద్ధార్థ్ '18 పేజెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

    ఉల్లిపొర లాంటి షర్ట్‌లో బిగ్ బాస్ లహరి రచ్చ: లోపలికి కనిపించేలా హాట్ షోఉల్లిపొర లాంటి షర్ట్‌లో బిగ్ బాస్ లహరి రచ్చ: లోపలికి కనిపించేలా హాట్ షో

    వైవిధ్యమైన కాన్సెప్టుతో ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన '18 పేజెస్' గత డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ఆరంభంలోనే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఓపెనింగ్స్ మంచిగా వచ్చాయి. అలా దాదాపు రెండు వారాల పాటు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఇలా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కూడా చేరుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. దీనికితోడు రిలీజ్‌కు ముందే ప్రాఫిట్స్‌ను అందుకున్న ఈ చిత్రం నిర్మాతలకు మొత్తంగా కొన్ని కోట్ల లాభాలను తెచ్చింది. ఈ సినిమా ఫలితంతో హీరో నిఖిల్ వరుసగా రెండో విజయాన్ని దక్కించుకున్నట్లు అయింది.

    18 Pages Movie Streaming Start on Aha and Netflix

    వెండితెరపై దాదాపు రెండు మూడు వారాల పాటు ప్రేక్షకులను అలరించిన నిఖిల్ '18 పేజెస్' మూవీని అనుకున్న సమయానికి కంటే ముందుగానే డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ, అలా మాత్రం జరగలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ.. అలాగే, నిర్మాత సంస్థకు చెందిన ఆహాలో ఈ చిత్రాన్ని నేటి నుంచి (జనవరి 27) ప్రసారం చేస్తున్నారు. ఇక, ఇందులో థియేటర్లలో చూపించని కొన్ని డిలీటెడ్ సీన్స్‌ను కూడా యాడ్ చేశారని తెలుస్తోంది. ఇక, రెండు ఓటీటీల్లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన దక్కుతుందని టాక్.

    పైన ఏమీ లేకుండా అనుష్క హాట్ షో: కోహ్లీ వైఫ్ ఎద అందాల ట్రీట్పైన ఏమీ లేకుండా అనుష్క హాట్ షో: కోహ్లీ వైఫ్ ఎద అందాల ట్రీట్

    18 Pages Movie Streaming Start on Aha and Netflix

    యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన '18 పేజెస్' మూవీని పల్నాటి సూర్య ప్రతాప్ రూపొందించారు. దీన్ని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీలో దినేష్ రాజ్, అజయ్, పోసాని, బ్రహ్మాజీలు కీలక పాత్రల్లో నటించారు. దీనికి గోపీ సుందర్ సంగీతాన్ని సమకూర్చారు.

    English summary
    Nikhil Siddhartha Did 18 Pages Movie Under Palnati Surya Pratap Directions. This Movie Streaming on Aha and Netflix From Today.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X