2018 OTT: అప్పుడే ఓటీటీలోకి 2018 మూవీ.. 150 కోట్ల సినిమా ఊహించని విధంగా!
2018వ సంవత్సరంలో కేరళ రాష్ట్రాన్ని భారీ వరదలు అతలాకుతలం చేసేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ప్రాణ, ఆస్తి నష్టం ఎంతో జరిగింది. అప్పటి సంఘటనలు ప్రధానంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమే '2018'. ప్రతి ఒక్కరిలోనూ హీరో ఉన్నాడు అనే కాన్సెప్టుతో రూపొందిన ఈ సినిమా కేరళలో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఏకంగా రూ. 150 కోట్లుకు పైగా గ్రాస్‌ను వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అలాగే, రూ. 80 కోట్లుకు పైగా షేర్‌తో మలయాళంలో టాప్ మూవీగా రికార్డును క్రియేట్ చేసుకుంది.
మలయాళంలో సెన్సేషనల్ హిట్ అయిన '2018' మూవీని గత వారంలోనే తెలుగులోనూ అత్యంత గ్రాండ్‌గా విడుదల చేశారు. కేరళ వాళ్ల మాదిరిగానే మన ప్రేక్షకులు కూడా ఈ సినిమాను బాగానే ఆదరించారు. దీంతో ఇక్కడ కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా రూ. 4 కోట్లుకు పైగా గ్రాస్‌ను వసూలు చేయడంతో పాటు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా విడుదలైన అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకు వస్తున్నట్లు తాజాగా సదరు సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.

ఆరంభంలో పెద్దగా అంచనాలు లేకపోయినా '2018' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం సోనీ లివ్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సదరు సంస్థ జూన్ 7వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. అంటే మే 5న విడుదలైన '2018' నెల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తుంది.
సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కాబోయేది కేవలం మలయాళ వెర్షన్ మాత్రమే అని తెలిసింది. తెలుగు వెర్షన్ ఓటీటీలోకి రావడానికి ఇంకా సమయం పడుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికీ మలయాళంలో కలెక్షన్లను బాగానే రాబడుతున్న ఈ చిత్రాన్ని అప్పుడే స్ట్రీమింగ్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక, టోవినో థామస్ ప్రధాన పాత్రను చేసిన '2018' మూవీని జూడే ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించాడు. దీన్ని కావ్య ఫిల్మ్స్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ బ్యానర్లపై వేణు, పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించారు. నోబిన్ పాల్, విలియమ్ సంగీతం ఇచ్చారు.


Click it and Unblock the Notifications











