2018 OTT: అల్లు అరవింద్ ప్రయత్నం విఫలం.. అప్పుడే ఓటీటీలోకి హిట్ మూవీ
ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిన సినిమాల్లో '2018' ఒకటి. మలయాళ పరిశ్రమ నుంచి వచ్చిన ఈ మూవీ.. 2018లో కేరళ రాష్ట్రాన్ని కుదిపేసిన వరదల నేపథ్యంతో తెరకెక్కింది. దీంతో అక్కడ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవడంతో భారీ స్పందనను సొంతం చేసుకుంది. ఫలితంగా మొదటి రోజు పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోయిన ఈ మూవీ.. రెండో రోజు నుంచి సత్తా చాటింది. అలా ఈ చిత్రం మలయాళంలో 170 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా అక్కడ అత్యధిక వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
మలయాళంలో సంచలన విజయాన్ని అందుకున్న '2018' మూవీని జీఏ2 పిక్చర్స్ బ్యానర్ అధినేత బన్నీ వాస్ మే 26వ తేదీన తెలుగులోనూ భారీగా విడుదలైంది. ఈ సినిమాకు కేరళ ప్రేక్షకుల మాదిరిగానే మన వాళ్లు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. దీంతో ఇక్కడ కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంది. అప్పటి నుంచి దాదాపు రూ. 2.50 కోట్లకు పైగా లాభాలను కూడా సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇంతలోనే '2018' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చేసింది.

'2018' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడిన నేపథ్యంలో ఓటీటీ దిగ్గజం సోనీ లివ్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సదరు సంస్థ జూన్ 7వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అయితే, బడా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్ చేయాలని సోలీ లివ్ వాళ్లను రిక్వెస్ట్ చేశారు. కానీ, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. '2018' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. గత అర్ధరాత్రి నుంచి ఇది తెలుగు, మలయాళం, హిందీ, కన్నడం, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనివల్ల తెలుగులో కలెక్షన్లు పడిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఇదిలా ఉండగా.. టోవినో థామస్ హీరోగా నటించిన '2018' మూవీని జూడే ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించాడు. దీన్ని కావ్య ఫిల్మ్స్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ బ్యానర్లపై వేణు, పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించారు. నోబిన్ పాల్, విలియమ్ సంగీతం ఇచ్చారు. ఇందులో అసిఫ్ అలీ, కుంచాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, లాల్, నరైన్‌లు నటించారు.


Click it and Unblock the Notifications











