2018 OTT: 13 రోజులకే ఓటీటీలోకి.. అల్లు నిర్మాతకు బడా సంస్థ షాక్
2018.. 2018.. 2018 దాదాపు నెల రోజులుగా ఇండియా వ్యాప్తంగా మారుమ్రోగిపోతోన్న సినిమా పేర్లలో ఇది ఒకటి. అంతలా ఈ మూవీ ఎవరూ ఊహించని రీతిలో కలెక్షన్లను రాబడుతూ సత్తా చాటుతోంది. దీంతో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.
మలయాళ పరిశ్రమకు చెందిన ఫేమస్ హీరో టివినో థామస్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని జుడే ఆంథనీ థామస్ తెరకెక్కించాడు. 2018లో కేరళ రాష్ట్రాన్ని కుదిపేసిన వరదల నేపథ్యంతో ఇది రూపొందింది. ఆ వరదల కంటే ఎక్కువగానే కలెక్షన్ల సునామీని సృష్టించి మలయాళ పరిశ్రమ చరిత్రలోనే టాప్ మూవీగా రికార్డు కొట్టింది.

మలయాళంలో గొప్ప విజయాన్ని అందుకున్న '2018' మూవీని జీఏ2 పిక్చర్స్ బ్యానర్ అధినేత బన్నీ వాస్ మే 26వ తేదీన తెలుగులోనూ గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కేరళ ప్రేక్షకుల మాదిరిగానే మన వాళ్లు కూడా మంచి స్పందనను అందించారు.
దీంతో ఇక్కడ కేవలం 5 రోజుల్లోనే ఈ సినిమా రూ. 6 కోట్లు వరకూ గ్రాస్‌ను వసూలు చేయడంతో పాటు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని క్లీన్ హిట్ స్టేటస్‌ను చేరుకుంది. దీంతో ఈ మూవీకి తెలుగులో లాభాలు మరింతగా వచ్చే ఛాన్స్ ఉందని అనుకున్నారు. ఇంతలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌పై ప్రకటన వచ్చింది.
'2018' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడిన నేపథ్యంలో ఓటీటీ దిగ్గజం సోనీ లివ్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని సదరు సంస్థ జూన్ 7వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. ముందుగా దీని మలయాళ వెర్షన్‌ను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది.
అయితే, '2018' మూవీని మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. అంటే.. తెలుగులోకి వచ్చిన 13 రోజులకే ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుందన్న మాట. దీనివల్ల బన్నీ వాస్‌కు షాక్ తగిలినట్లు అయింది.
ఇదిలా ఉండగా.. టోవినో థామస్ ప్రధాన పాత్రను చేసిన '2018' మూవీని జూడే ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించాడు. దీన్ని కావ్య ఫిల్మ్స్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ బ్యానర్లపై వేణు, పద్మ కుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించారు. నోబిన్ పాల్, విలియమ్ సంగీతం ఇచ్చారు. ఇది కేరళలో రూ. 155 కోట్లు పైగా గ్రాస్ రాబట్టింది.


Click it and Unblock the Notifications











