twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2022 నెట్ ఫ్లిక్స్ లో మన సినిమాల రికార్డులు.. ఎక్కువ వ్యూవ్స్ అందుకున్న సినిమాలు ఇవే!

    |

    ఈ ఏడాది కొన్ని పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకోవడమే కాకుండా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కూడా మంచి రెస్పాన్స్ అందుకోవడం విశేషం. ముఖ్యంగా మన తెలుగు సినిమాలు అయితే నెట్ ఫ్లిక్స్ లో కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకున్నాయి. కొన్ని చిన్న సినిమాలకు కూడా నెట్ ఫ్లిక్స్ లో ఈసారి అద్భుతమైన డీల్స్ లభించాయి. ఇక టాలీవుడ్ సినిమాలతోనే నెట్ ఫ్లిక్స్ స్థాయి కూడా పెరిగింది అని చెప్పవచ్చు. ఇక 2022లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధిక స్థాయిలో వ్యూవ్స్ అందుకున్న తెలుగు సినిమాల వివరాల్లోకి వెళితే..

    గాడ్ ఫాదర్ టాప్ 5లో

    గాడ్ ఫాదర్ టాప్ 5లో

    ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో హిందీలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాకు అక్కడ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఓటీటీలో విడుదలవుతోంది అనగానే అన్ని వర్గాల ఆడియన్స్ కూడా ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో చూసేందుకు ఆసక్తి చూపించారు. ఇక గాడ్ ఫాదర్ సినిమా మొత్తంగా 3.83 మిలియన్లకు పైగా వ్యూవ్స్ అయితే అందుకుంది.

     రాధే శ్యామ్

    రాధే శ్యామ్

    ఇక ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరపైకి వచ్చిన ఈ అడ్వెంచర్ లవ్ స్టోరీ సినిమాను రాధాకృష్ణ తెరపైకి తీసుకు వచ్చాడు. విడుదలైన కొన్ని రోజులకే ఈ సినిమా ట్రెండింగ్ లిస్టులోకి వెళ్లిపోయింది. ఇక మొత్తంగా అయితే 4.01 మిలియన్లకు పైగా వ్యూవ్స్ సొంతం చేసుకుంది. తెలుగులో కూడా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం తీవ్రంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే.

    శ్యామ్ సింగరాయ్ రికార్డ్

    శ్యామ్ సింగరాయ్ రికార్డ్

    నేచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా కూడా విడుదలైంది. ఇక థియేటర్లోనే కాకుండా ఈ సినిమాకు ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరపైకి వచ్చిన ఈ డిఫరెంట్ ఎమోషనల్ లవ్ డ్రామా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఓటీటీ లో కూడా జనాలు ఈ సినిమాను ఎగబడి చూశారు. మొత్తంగా అయితే నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగరాయ్ సినిమాకు 4.2 మిలియన్లకు పైగా వ్యూవ్స్ వచ్చాయి.

    మేజర్ హవా

    మేజర్ హవా

    ఇక అడివి శేష్ నటించిన మేజర్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అడివి శేష్ కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఓటీటీ లో కూడా అదే తరహాలో క్రేజ్ అయితే దక్కింది. ఇక మొత్తంగా మేజర్ సినిమా 7.03 మిలియన్లకు పైగా వ్యూవ్స్ సొంతం చేసుకుంది.

     RRR మూవీ రికార్డ్

    RRR మూవీ రికార్డ్

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ RRR హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఇక మిగతా వెర్షన్స్ కంటే కూడా హిందీ వెర్షన్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దేశ విదేశాల నుంచి ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక మొత్తంగా నెట్ ఫ్లిక్స్ లో అయితే RRR సినిమా 39.03 మిలియన్ లను సొంతం చేసుకుంది.

    English summary
    2022 netflix top tollywood viewed movies top position in RRR
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X