OTTలోకి 2023 బిగ్గెస్ట్ హార్రర్ మూవీ.. చూడాలంటే డేర్ ఉండాల్సిందే!

ఈ మధ్య కాలంలో కంటెంట్ బాగుంటే.. సినిమాలను మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే సంగతి తెలిసిందే. ఇక అందులోనూ హార్రర్ సినిమాలను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఇటీవల కాలంలో లో 2023లోనే బిగ్గెస్ట్ హార్రర్ మూవీగా పిండం తెరకెక్కింది. అయితే ఈ సినిమా థియేటర్లలో ఎంత వణికించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయిపోయింది. ఆ వివరాల్లోకి వెళితే...

ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం తెలిసిందే. ఈ తరహాలోనే.. విడుదలైన బలగం, బేబి, సామజవరగమన, సీతారామం వంటి చిన్న చిన్న సినిమాలన్నీ భారీ విజయాలను అందుకుంది. అయితే కంటెట్ బాగున్న సినిమాలకి ప్రమోషన్స్ కూడా పెద్దగా అవసరం లేదనే చెప్పాలి. ఇక హరర్ థ్రిల్లర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలైతే విపరీతంగా క్లిక్ అవుతాయి.

2023 Biggest Horror Pindam Movie Going to Streaming on Netflix From Jan 1st Week 2024 Full Details Here

ఇక చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఇలాంటి సినిమాలకు భయపడుతూనే.. ఆసక్తిగా చూస్తారనే విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే విడుదలైన భయంకరమైన హరర్ సినిమాలో ఒకటి పిండం మూవీ. ఈ పిండం సినిమా విడుదలై ఆడియన్స్‌ను థియేటర్లలో భయపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా పిండం మూవీ.. ఓటీటీలో కూడా భయపెట్టించడానికి రెడీ అవుతుంది.

నటుడు శ్రీరామ్ చాలా ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా తాజా చిత్రం పిండం. ఈ సినిమాను కొత్త దర్శకుడు సాయి కిరణ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను కళాహి మీడియా బ్యానర్‌ పై హారర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 15న థీయేటర్ లో విడుదల అయి ఆకట్టుకుంది. మంచి వసూళ్లనే రాబట్టింది.

పిండం సినిమా ఓటీటీలో హడలెత్తించడానికి సిద్ధం అవుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ డేట్ కూడా చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది. చాలావరకు హర్రర్ ల్లో ది బెస్ట్ హర్రర్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్‌ దక్కించుకుందని సమాచారం. పిండం సినిమా న్యూ ఇయర్ కానుకగా 2024 జనవరి ఫస్ట్ వీక్‌లో.. స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారట.

2023 Biggest Horror Pindam Movie Going to Streaming on Netflix From Jan 1st Week 2024 Full Details Here

ఈ సినిమా కథ విషయానికి వస్తే.... ఆంథోని(శ్రీరామ్‌) ఓ రైస్‌ మిల్లులో అకౌంటెంట్‌ గా పని చేస్తుండగా.... అతని భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి శుక్లాపేటలోని ఓ ఇంట్లో నివసిస్తూ ఉంటాడు. అయితే అది ఓ పురాతమైన ఇల్లు... తక్కువ ధరకు వస్తుందని భావించి ఆ ఇంటిని కొనుగోలు చేస్తాడు హీరో.

అయితే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత వారికి ఊహించని సంఘటనలు ఎదురు కాగా... వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనే కథంశంతో తెరకెక్కించారు. మీరు ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయితే కనుక ఓటీటీలో చూసేయండి. కానీ గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఈ సినిమాను చూడొద్దని సెన్సార్ బోర్డు ప్రకటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X