OTTలో దుమ్మురేపుతున్న టాప్ 10 సిరీసులివే.. నంబర్ 1 స్థానంలో రీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్!
2023లో ఎన్నో వెబ్ సిరీసులు ఓటీటీ ప్రేక్షకులను అలరించాయి. అయితే వాటిలో టాప్ 10 వెబ్ సిరీసులు ఏవి అంటే మాత్రం చెప్పడం కష్టం. అయితే ప్రముఖ మీడియా ఆర్మాక్స్ సంస్థ తాజాగా టాప్ 10 వెబ్ సిరీస్ లిస్టును తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అందులో అక్కినేని నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ నంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. ఇక ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయి నెల రోజులు అయినా నంబర్ 1లో ఉండటం విశేషం. ఇక టాప్ 10 సిరీస్ లిస్టును ఈస్టోరీలో తెలుసుకుందాం.
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్.. సీని ప్రముఖులపై సర్వే నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈ సారి ఓటీటీల్లో ది బెస్ట్ టాప్ 10 ఒరిజినల్స్ ఏంటి అనే దానిపై ఇండియాలో సర్వే నిర్వహించి.. టాప్ 10 వెబ్ సిరీస్ లిస్టును రిలీజ్ చేసింది. అందులో హాలీవుడ్ టు టాలీవుడ్ సిరీసులు ఉండగా.. నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ నంబర్ 1 స్థానంలో ఉంది. ఇక ఈ సిరీస్ నవంబర్ 30న రిలీజ్ అయింది అయినప్పటికీ ఇప్పటికీ ట్రెండింగ్ లో నిలిచింది.

మనం సినిమా తర్వాత విక్రమ్ కే కుమార్ నాగచైతన్యతో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇది. ఇక ఈ సీరిస్ అమోజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సిరీస్ నాగచైతన్యకు మొదటి వెబ్ సిరీస్. ఇక ఈ సీరిస్ కోసం చైతూ బాగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సీరిస్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కగా.. ఓటీటీలో ఈ సిరీస్ ఆకట్టుకుంటుంది.
ఇక టాప్ 2 రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన ది రైల్వే మెన్ సిరీస్ నిలిచింది. ఇక ఈ వెబ్ సిరీస్ భూపాల్ గ్యాస్ విపత్తు ఆధారంగా తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ది ఫ్రిలాన్సర్ సిరీస్ టాప్ 3లో ఉంది. డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ కు మంచి ఆదరణ వస్తుంది.

ఇక టాప్ 4లో ఆర్య నటించిన హార్రర్ థ్రిల్లర్ ది విలేజ్ నిలిచింది. ఇక ఈ సీరిస్ చూడాలంటే కాస్త డేర్ ఉండాల్సిందే. ఆర్య నటించిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఆ తర్వాతి స్థానంలో బెర్లిన్ వెబ్ సిరీస్ నిలిచింది. ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. టాప్ 6 స్థానంలో జాన్వీ కపూర్ చెల్లెలు కుషి కపూర్ నటించిన ది అర్చివ్స్ నిలిచింది. ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక టాప్ 7లో ఇమ్మెచ్యూర్ సీజన్ 3 నిలువగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇక టాప్ 8లో లోకీ సీజన్ 2 ఉండగా డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. టాప్ 9లో ది లెజెంట్ హనుమాన్ నిలువగా ఇది డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 10లో ఇండియన్ పోలీస్ ఫోర్స్ నిలిచింది. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇవండి టాప్ 10 ఒరిజల్స్.. మీరు కనుగ ఈ సీరిసులు, సినిమాలు. వీటిని మీరు మిస్ అయితే.. ఓటీటీలో చూసేయండి.


Click it and Unblock the Notifications











