OTTలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న టాప్ 10 సిరీసులివే... నంబర్ 2లో రీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్!

2024లో ఇప్పటికే వెబ్ సిరీసులు రిలీజ్ అయి ఓటీటీ ప్రేక్షకులను అలరించాయి. అయితే వాటిలో టాప్ 10 వెబ్ సిరీసులు ఏవి అంటే చెప్పడం కష్టమే. అయితే ప్రముఖ మీడియా ఆర్మాక్స్ సంస్థ తాజాగా టాప్ 10 ఒరిజినల్స్ లిస్టును రిలీజ్ చేసింది. అందులో టాప్ 1లో సిద్ధార్థ్ మల్హోత్ర, శిల్పా శెట్టి నటించిన ఇండియన్ పోలీస్ ఫోర్స్ టాప్ 1లో ఉంది. ఇక టాప్ 2లో రీసెంట్ సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ నిలిచింది. ఇక ఆర్మాక్స్ రిలీజ్ చేసిన లిస్టులో టాప్ 10 సిరీసులు ఏంటో చూద్దాం.

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్.. సీని ప్రముఖులపై సర్వే నిర్వహిస్తూ ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఓటీటీల్లో ది బెస్ట్ టాప్ 10 ఒరిజినల్స్ ఏంటి అనే దానిపై సర్వే నిర్వహించింది. ఇండియాలో టాప్ 10 వెబ్ సిరీస్ లిస్టును తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. అందులో హాలీవుడ్ టు టాలీవుడ్ ఒరిజినల్స్ ఉండగా.. ఇండియన్ ఫోర్స్ పోలీస్ నంబర్ 1 స్థానంలో ఉంది.

2024 Top 10 Web Series: Indian Police Force, Killer Soup, Karmma Calling, Aarya 3, The Legend of Hanuman Etc Full Details Here

బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి క్రియేట్ చేసి, డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ ఇండియన్ పోలీస్ ఫోర్స్. ఇది ఈ ఏడాది జనవరి 19 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నటీ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్, శిల్పా శెట్టి ప్రధానపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ జనవరి 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.

బాలీవుడ్ ఓ కాప్ యూనివర్స్ క్రియేట్ చేసిన రోహిత్ శెట్... సింగం, సింగం రిటర్న్స్, సింబా, సూర్యవంశిలాంటి కాప్ యూనివర్స్ సినిమాలను రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడీ వెబ్ సిరీస్ లో మరో ముగ్గురు పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్లను ఇంట్రడ్యూస్ చేసాడు. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు టాప్ 10 ఒరిజనల్స్ లో టాప్ 1 స్థానం కేైవసం చేసుకుంది.

2024 Top 10 Web Series: Indian Police Force, Killer Soup, Karmma Calling, Aarya 3, The Legend of Hanuman Etc Full Details Here

ఇక టాప్ 2లో కిల్లర్ సూప్ నిలిచింది. 'ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ బాజ్ పాయి ఈ సిరీసులో నటించాడు. ఇక ఇది ఒక యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జనవరి 11 న హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ క్రైమ్‌ సిరీస్‌లో మనోజ్‌ బాయ్‌పాయ్‌ డబుల్‌ రోల్ లో కనిపించాడు.

టాప్ 3లో కర్మా కాలింగ్.. డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాప్ 4లో సుస్మీతా సేన్ నటించిన ఆర్య సీజన్ 3 నిలిచింది. ఈ సిరీస్ కూడా డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. టాప్ 5లో ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సిరీస్ నిలవగా, టాప్ 6లో ఈకో నిలిచింది. ఈ రెండు కూడా హాట్ స్టార్ వేదికగా అందుబాటులోకి వచ్చాయి. షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3.. టాప్ 7లో నిలువగా సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక టాప్ 8లో దేహతి లడ్కే సీజన్ 2, టాప్ 9 హస్ట్లర్స్ నిలిచాయి. ఈ రెండు అమెజాన్ మిని టీవీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇక టాప్ 10లో బెర్లిన్ నిలిచింది. ఇవండి టాప్ 10 ఒరిజనల్స్. ఇందులో మీరు ఏదైనా మిస్ అయితే ఇంట్లోనే ఓటీటీలో చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X