OTTని షేక్ చేస్తున్న టాప్ 3 సినిమాలు ఇవే.. చివరలో 12th ఫెయిల్, ముందు స్థానాల్లో ఏవున్నాయంటే?

ఓటీటీలు వచ్చినప్పటి నుంచి వాటి హవా పెరిగిపోతూనే ఉంది. మొదట్లో.. థియేటర్లలో విడుదల అయిన చాలా రోజుల తర్వాత అనేక సినిమాలు ఓటీటీలోకి వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం కథ మారిపోయింది. థియేటర్ల వద్దడి సందడి చేసినిమా, చేయకపోయినా.. చిన్న సినిమాలు అయినా పెద్ద చిత్రాలు అయినా ఎంత పెద్ద హీరో సినిమా అయినా సరే నెల తిరగకముందే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

ఎవరూ ఊహించని స్థాయిలో కోట్ల కొద్ది వ్యూస్​ను దక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ప్రస్తుతం ఓ మూడు సినిమాలు అయితే ఓటీటీని షేక్ చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ టాప్ 3 చిత్రాల జాబితా తరచుగా మారుతుండగా... ఓ రెండు చిత్రాలు మాత్రం తమ స్థానాలను వదులుకోవడం లేదు. అయితే ఆ సినిమాలు ఏవి, అవి ఎక్కుడ స్ట్రీమింగ్ అవుతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2024 Top 3 Movies Creat Sensation in OTT 12th Fail And Other Two Movies Check Details

అర్జున్ రెడ్డి ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా ఓటీటీని షేక్ చేస్తోంది. డిసెంబర్ ఒకటో తేదీన థియేటర్లలో చాలా గ్రాండ్ గా విడుదల అయిన ఈ చిత్రాన్ని టి - సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్, సినీ వన్ స్టూడియోస్‌పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. పక్కా యాక్షన్ బ్యాక్​డ్రాప్​తో ప్యూర్ ఫాదర్ అండ్ సన్​ ఎమోషనల్​ డ్రామాగా రిలీజై సూపర్​ బ్లాక్ బస్టర్ హిట్​ను అందుకుంది.

ఇటీవలే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. వచ్చినప్పటి నుంచి టాప్ 1 ట్రెండింగ్ లోనే ఉంటోంది. నెట్ ఫ్లిక్స్ వేధికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.900కోట్లతో సంచలనం సృష్టించి.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమాను ఇప్పటికీ చాలా మంది చూసేస్తున్నారు.

2024 Top 3 Movies Creat Sensation in OTT 12th Fail And Other Two Movies Check Details

ఇక టాప్ 2లో కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా చేసిన టైగర్ 3 సినిమా నిలిచింది. ఈ చిత్రంలో కత్రినా కైఫ్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హస్మీ విలన్‌లుగా నటించి మెప్పించారు. దాదాపు 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది నవంబర్ 12వ తేదీన థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలకేపోయింది. కేవలం 466.63 కోట్ల రూపాయల కలెక్షన్లను వసూలు చేసింది. జనవరి 7 తేదీన నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేధికగా స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్ల వద్ద పెద్దగా ఆడకపోయినా ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

OTTలోకి వచ్చేసిన రీసెంట్ సైకలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్.. ఈ హిట్ సినిమాను ఎక్కడ చూడాలంటే?

2024 Top 3 Movies Creat Sensation in OTT 12th Fail And Other Two Movies Check Details

ఇక టాప్ 3లో ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ, ఐఆర్ఎస్ అధికారి శ్రద్ధా జోషిల నిజ జీవిత వృత్తాంతంతో ప్రేరణ పొంది రాసిన '12th ఫెయిల్' నవల ఆధారంగా వినోద్ చోప్రా ఫిల్మ్స్ బ్యానర్‌పై విధు వినోద్ చోప్రా, యోగేష్ ఈశ్వర్ నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 27వ తేదీన గ్రాండ్ గా విడుదల చేశారు. , మేధా శంకర్, ప్రియాంశూ ఛటర్జీ, సంజయ్ బిష్నోయి, హరీష్ ఖన్నా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు విధూ వినోద్ చోప్రా దర్శకత్వం వహించారు. డిసెంబ‌ర్ 29 నుండి హిందీ, త‌మిళ్‌, తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X