June 2025 Theatre and OTT Releases : జూన్ నెలలో థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే
2025 జూన్ నెలలో థియేటర్లలోకి స్టార్ హీరోల చిత్రాలు వస్తుండటం విశేషం. ప్రేక్షకులకు ఇప్పటికే థగ్ లైఫ్, భైరవం వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ జూన్ 30 వరకు మరిన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరోవైపు ఓటీటీలోకి కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..
ధనుష్ కుబేరా..
శేఖర్ కమ్ముల - ధనుష్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం 'కుబేరా'. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. కింగ్, అక్కినేని నాగార్జన కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలో రూపుదిద్దుకున్నా తెలుగులోనూ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
8 వసంతాలు చిత్రం..
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 8 వసంతాలు. ఈ చిత్రం కూడా జూన్ 20నే థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. తాజాగా టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. మ్యాడ్ సినిమా హీరోయిన్ అనంతిక సానీల్ కుమార్ హీరోయిన్ గా నటించింది. ఫణింద్ర దర్శకత్వం వహించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.

మంచు విష్ణు కన్నప్ప..
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఫాంటసీ ఫిల్మ్ కన్నప్ప. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. రూ.200 కోట్లకు పైగా వెచ్చించారు. ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్, మోహన్ లాల్, కాజల్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.
చెన్నై సిటీ
ఇక తమిళంలో చెన్నై సిటీ అనే చిత్రం ప్రేక్షఖుల ముందుకు రాబోతోంది. ఇది కూడా జూన్ 20నే విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో వైభవ్, మీటర్ హీరోయిన్ అత్యుల రవి జంటగా నటించారు. విక్రమ్ రాజేశ్వర్, అరుణణ్ కేశవ్ ద్వయం దర్శకత్వం వహించారు.
DNA
గద్దలకొండ గణేష్ చిత్రంలో కీలక పాత్ర పోషించిన అథర్వ నటించిన తాజాగా చిత్రమే 'డీఎన్ఏ'. ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం కూడా జూన్ 20నే విడుదల కాబోతోంది.
విజయ్ ఆంటోనీ Marrgan
ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన కోలీవుడ్ స్టార్ విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం 'మార్గన్'. ఈ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. సముద్రఖని కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం జూన్ 27న విడుదల కాబోతోంది.
అనుపమ పరమేశ్వరన్ JSK
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తాజాగా నటించిన మలయాళ చిత్రం 'జేఎస్కే'. ప్రవిన్ నారాయన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సమంత 'శుభం'..
ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్ లో సమంత నిర్మించిన తాజా చిత్రం 'శుభం'. ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. మే 9న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రంలో హర్షిత్ ఆర్, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రియా కొంతమ్, షాలిన కొండెపుడి, వంశీధర్ గౌడ్ లు కీలక పాత్రల్లో నటించారు. జూన్ 13న జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
శ్రీవిష్ణు #సింగిల్..
హీరో శ్రీవిష్ణు చివరిగా #Single చిత్రం ప్రస్తుతం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్, కల్యా ఫిల్మ్స్ బ్యానర్లలో విద్య కొప్పినీడి, బాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. జూన్ 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications











