28 డిగ్రీల వద్ద ఆమెకు ఏం జరిగింది? .. నెలలోపే ఓటీటీలోకి హార్రర్ థ్రిల్లర్, ఎందులో అంటే?
ఇండస్ట్రీలోకి వచ్చి 20 ఏళ్లు కావొస్తున్నా నేటికీ హీరోగా నిలదొక్కుకోలేక బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు నవీన్ చంద్ర. సంభవామీ యుగే యుగే చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఆయన అందాల రాక్షసితో హిట్ అందుకున్నారు. కానీ తర్వాత ఆ జోష్ కంటిన్యూ చేయలేకపోయారు. సెకండ్ హీరో, విలన్ రోల్స్ చేస్తూ కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం 28 డిగ్రీస్ సెల్సియస్. ఇటీవల థియేటర్‌లో రిలీజైన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ వివరాల్లోకి వెళితే..
ఓటీటీల రాకతో మీడియం సైజ్, చిన్న నటీనటులకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి నవీన్ చంద్ర కూడా తనకు వచ్చిన అవకాశాలను బాగానే వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో పరంపర, ఇన్స్‌పెక్టర్ రిషి, స్నేక్స్ అండ్ లాడర్స్ వంటి ఓటీటీ సిరీస్‌లతో తనదైన ముద్ర వేశారు. ఓటీటీ సెక్టార్‌లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నవీన్ చంద్ర అప్పుడప్పుడు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఆయన రీసెంట్ మూవీ 28 డిగ్రీస్ సెల్సీయస్. ఈ నెలలోనే థియేటర్‌లోకి వచ్చిన ఈ చిత్రం నెల తిరక్కుండానే ఓటీటీలోకి రానుంది.

కరోనా లాక్‌డౌన్ సమయంలో పొలిమేర సిరీస్‌తో ప్రేక్షకులను భయపెట్టి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే 28 డిగ్రీస్ సెల్సియస్. ఇందులో నవీన్ చంద్ర సరసన షాలిని వడ్నికట్టి హీరోయిన్‌గా నటించారు. ప్రియదర్శి, వైవా హర్ష, జయప్రకాష్, రాజా రవీంద్ర, దేవియాని శర్మలు కీలకపాత్రలు పోషించారు. వీరాంజనేయ ప్రొడక్షన్స్, రివర్‌సైడ్ సినిమాస్ పతాకాలపై సాయి అభిషేక్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, శార్వణ్ భరద్వాజ్ పాటలకు సంగీతాన్ని అందించారు. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. నిజానికి ఆరేళ్ల క్రితమే 28 డిగ్రీస్ సెల్సియస్ చిత్రాన్ని అనిల్ తెరకెక్కించారు. కరోనాకు ముందే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే అనివార్య కారణాలతో 28 డిగ్రీస్ సెల్సియస్ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అన్ని అవాంతరాలను దాటుకుని ఎట్టకేలకు ఏప్రిల్ 4న విడుదలైంది.
కార్తీక్ (నవీన్ చంద్ర) ఓ పేరున్న డాక్టర్.. ఇతను మెడిసిన్ చదివే రోజుల్లోనే అంజలి (షాలిని)ని ప్రేమించాడు. అనాథ పెరిగిన కార్తీక్‌ను అంజలికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె తల్లిదండ్రులు నిరాకరిస్తారు. దీంతో ఈ జంట లేచిపోయి పెళ్లి చేసుకుంటుంది. కాపురం సాఫీగా సాగుతున్న దశలో అంజలికి అరుదైన అనారోగ్య సమస్య వస్తుంది. ఆమె శరీర ఉష్ణోగ్రత 28 డిగ్రీలు మించినా, తగ్గినా చనిపోతుంది. చికిత్స నిమిత్తం అంజలిని ఫారిన్ తీసుకెళ్తాడు కార్తీక్. అయితే ఓ రోజున అంజలి చనిపోయి కనిపిస్తుంది. భార్య మరణంతో కార్తీక్ తాగుడికి బానిస అవుతాడు. అయితే ఇంట్లో అంజలి ఆత్మ తిరుగుతున్నట్లుగా కార్తీక్‌కి అనుమానం వస్తుంది. అసలు అంజలి ఎలా చనిపోయింది? నిజంగానే అంజలి ఆత్మ ఆ ఇంట్లో తిరుగుతుందా? ఈ మిస్టరీని కార్తీక్ ఎలా ఛేదించాడన్నదే 28 డిగ్రీస్ సెల్సియస్ సినిమా కథ.
కథ, స్క్రీన్ ప్లే పరంగా ఓకే అనిపించుకున్న 28 డిగ్రీస్ సెల్సియస్‌పై ఆ సమయంలో భారీ సినిమాల ప్రభావం పడటంతో బాక్సాఫీస్ వద్ద ఎఫెక్ట్ గట్టిగా పడింది. థియేటర్‌లో డిజాస్టర్‌గా నిలిచిన 28 డిగ్రీస్ సెల్సియస్ చిత్రం నెల తిరిగేసరికి సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఓటీటీలో నవీన్ చంద్ర సినిమాకు ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











