OTTలోకి డైరెక్టుగా వచ్చేసిన 30 వెడ్స్ 21 హీరోయిన్ కొత్త సినిమా.. ఎందులో చూడాలంటే?

కరోనా టైంలో 30 వెడ్స్ 21 వెబ్ సిరీసుతో ముందుకు వచ్చిన అనన్యా శర్మ గురించి అందరికి తెలిసిందే. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆ సీరిసులో ఆ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ సీరిసు తర్వాత ఈ భామకు కొన్ని సినిమాల్లో నటించి అవకాశం వచ్చింది. కానీ ఫుల్ లెంగ్త్ సినిమాలు రాలేదు. ఇప్పుడు తాజాగా ఈ భామ కీ రోల్ లో నటిస్తున్న ఓ సినిమా డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా ఏంటి... కథేంటి.. ఎందులో చూడాలి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో అందరి దృష్టిని ఆకర్షించింది అనన్య శర్మ. ఇక ఈ భామ మెయిన్ రోల్ నటిస్తున్న కొత్త చిత్రం కృష్ణా రామా. ఇందులో రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక వీరు గతంలో హీరో, హీరోయిన్లుగా నటించిన బామ్మ మాట బంగారు బాట సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ జంటకు మంచి గుర్తింపు అయితే వచ్చింది. ఆ తర్వాత ఈ జంట పలు సినిమాల్లో కలిసి నటించారు.

30 weds 21 Heroine Ananya Sharma Krishna Rama Movie Streaming Now on Etv Win OTT

ఇక ఇటీవల ఈ జంట సంతోష్‌ శోభన్‌ హీరోగా నటించిన అన్నీ మంచి శకునములే సినిమాలోనూ కనిపించారు. ఇప్పుడీ సక్సెస్‌ ఫుల్‌ కాంబినేషన్లో మరో సినిమా వచ్చేసింది. అదే కృష్ణారామా సినిమా. ఇందులో 30 వెడ్స్ 21 వెబ్‌సిరీస్ ఫేమ్ అన‌న్య మరో కీలక పాత్రలో నటిస్తుంది. ఇక ఈ సినిమా డైరెక్టుగా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఈటీవీ విన్‌లో ఆదివారం (అక్టోబర్‌ 22) నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా ఈటీవీ విన్ ఓ పోస్టర్ రిలీజ్ చేసి చెప్పింది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే... ఈ సినిమాకు రాజ్ మాదిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సునీల్ క‌శ్య‌ప్ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ 'కృష్ణారామా' సినిమాను వెంకట్‌ కిరణ్‌ కుమార్‌ కల్లకూరి, హేమ మాధురి కల్లకూరి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

30 weds 21 Heroine Ananya Sharma Krishna Rama Movie Streaming Now on Etv Win OTT

ఇక ఈ సినిమా సరికొత్త కథాంశంతో, రోజువారీ జీవితంలో సోషల్‌ మీడియా ఎలాంటి పాత్ర పోషిస్తుందనేది కళ్లకు కట్టినట్లు చూపించినట్లు తెలుస్తోంది. వృద్ధాప్యంలో ఉన్న ఒక జంట ఫేస్‌బుక్‌లో ఎలా పాపులర్‌ అయ్యారు... వారు పాపులర్ అయ్యాక ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు.. వారి పిల్లలు వారికి దూరంగా ఉండటానికి కారణం ఏమిటి.. వంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ పండుగ సమయంలో కుటుంబం అంతా కలిసి చూసే చిత్రమిది. ఒక మంచి భావోద్వేగభరితమైన సినిమాగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతుంది. అనన్య శర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, రవి వర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాను మీరు ఈ పండక్కి.. ఇంట్లోనే అందరితో కలిసి ఓటీటీలో చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X