ఓటీటీలోకి 3BHK .. సిద్ధార్ధ్ మూవీ స్ట్రీమింగ్ ఎందులో? ఎప్పుడంటే?

ఒకప్పుడు వరుసగా ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో బాక్సాఫీస్‌ను వణికించారు సిద్ధార్ధ్. తమిళ నటుడే అయినప్పటికీ తెలుగులోనూ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఫాలోయింగ్ సంపాదించారు. కానీ ఏమైందో కానీ గత కొన్నేళ్లుగా సిద్ధార్ధ్ వరుసగా ఫ్లాపులు ఇస్తున్నాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు 2 డిజాస్టర్ అయ్యింది. రేసులో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన దశలో ఫ్యామిలీ డ్రామాను నమ్ముకున్నారు సిద్ధార్ధ్ అదే 3బీహెచ్‌కే. జూలై 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ వివరాల్లోకి వెళితే..

3BHKలో సిద్దార్ధ్ సరసన చైత్ర జే ఆచార్ నటించగా.. శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. ఆర్ శరత్ కుమార్, దేవయాని, యోగిబాబు, వివేక్ ప్రసన్న, సుబ్బు పంచులు కీలకపాత్రలు పోషించారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మించారు. దినేష్ బీ కృష్ణన్, జితిన్‌లు ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరించగా.. అమృత్ రామ్‌నాథ్‌ స్వరాలు అందించారు.

3BHK OTT Release Date Siddharth s Movie Ready to set online Streaming

3BHK బ్రేక్ ఈవెన్ టార్గెట్
సిద్ధార్థ్‌కు ప్రస్తుతం ఉన్న మార్కెట్‌కు అనుగుణంగా 3BHKని నిర్మించారు. చెన్నైతో పాటు పరిసర ప్రాంతాల్లోని అందమైన లోకేషన్స్‌లో ఈ సినిమాను చిత్రీకరించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్.. ప్రమోషనల్ ఖర్చులు కలిపి 3BHK సినిమాకు దాదాపు 40 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని నిర్మాతలు తెలిపారు. 3BHK చిత్రానికి 19 కోట్ల రూపాయల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు విశ్లేషకులు వెల్లడించారు. ఆంధ్రా, నైజాంలలో ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది. సిద్ధార్ధ్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల రూపాయల షేర్.. 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాలని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

3BHK కలెక్షన్స్:
3BHK వసూళ్ల విషయానికి వస్తే.. మార్నింగ్ షో నుంచి పాజిటివ్ టాక్, మౌత్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు తొలిరోజు రూ.1.35 కోట్లు, 2వ రోజు రూ.2.25 కోట్లు, 3వ రోజు రూ.3.88 కోట్లు, 4వ రోజు రూ.72 లక్షలు, 5వ రోజు రూ.1.05 కోట్లు, 6వ రోజు రూ.65 లక్షలు, 7వ రోజు రూ.65 లక్షలు వసూల్ చేసింది. మొత్తం ఫస్ట్ వీక్‌ ఇండియాలో నికరంగా రూ.7.68 కోట్లు.. రూ.9 కోట్ల గ్రాస్ రాబట్టింది. అలా 25 రోజుల వరకు సిద్ధార్ధ్ మూవీ ఇండియాలో 12.32 కోట్ల రూపాయల నెట్.. 13.89 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఓవర్సీస్‌లో రూ.1.75 కోట్ల కలెక్షన్స్ రాగా.. దీంతో కలుపుకుని 3BHK మూవీకి ప్రపంచవ్యాప్తంగా 15.64 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. ఈ వసూళ్లతో సిద్థార్ధ్ మూవీ చాలా ఏరియాలలో నష్టాలను మిగిల్చాడు. రూ. 20 కోట్ల డిస్ట్రిబ్యూషన్ టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించిన 3BHK మూవీ.. కేవలం 8 కోట్ల షేర్ మాత్రమే అందుకుని దాదాపు 12 కోట్ల రూపాయల నష్టాలను మిగిల్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

3BHK ఏ ఓటీటీలో?
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సొంతింటి కల చుట్టూ తిరిగే ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం.. కొంత మేరకు ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడంలో సక్సెస్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినప్పటికీ విమర్శకుల ప్రశంసలు పొందింది. థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అందరి చూపు నెలకొంది. దీనికి మేకర్స్ తెరదించారు. ఆగస్ట్ 1 నుంచి తెలుగు, తమిళ భాషల్లో సింప్లి సౌత్ ఓటీటీలో 3BHK స్ట్రీమింగ్ అవుతుందని క్లారిటీ ఇచ్చింది. అయితే భారత్‌లో ఉన్న ప్రేక్షకులకు ఈ సినిమా అందుబాటులో ఉండదని తెలిపింది. కేవలం భారత్‌కు వెలుపల ఉన్న దేశాలలో ఈ 3BHK సినిమాను వీక్షించవచ్చని సింప్లీ సౌత్ పేర్కొంది. భారత్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌కు సంబంధించి త్వరలోనే క్లారిటీ రానుంది.

More from Filmibeat

Read more about: 3 BHK siddharth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X