OTTలోకి మ్యూజికల్ రొమాన్స్ ఫిలిం.. ఎందులో చూడాలంటే?

ప్రేక్షకుల కోసం.. సరికొత్త ఓటీటీలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఓటీటీ కంటెంట్ కూడా సరికొత్తగా ఉంటుంది. ఓటీటీలోనే సరికొత్త సినిమాలను, సిరీసులను డైరెక్టుగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇక తాజాగా ఓటీటీలోకి మరో డైరెక్ట్ మూవీ వచ్చేసింది. తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 96 సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమాలో నటించి గౌరీ కిషన్ తెలుగువారికి సుపరిచితమే. ఈ భామ నటించిన తాజా చిత్రం లిటిల్ మిస్ నైనా. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

తమిళంలో 96 మూవీ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విజయ్ సేతపతి హీరోగా, త్రిష హీరోయిన్ గా వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్టుగా నిలిచింది. ఈ చిత్రంలో స్కూల్ అమ్మాయిగా కనిపించి, నటనతో, అందంతో అందరినీ ఆకట్టుకున్న భామ గౌరీ జీ కిషన్. ఇక ఈ సినిమా తెలుగులోనూ రీమేక్ చేశారు. శర్వానంద్, సమంత జోడీగా తెరకెక్కిన జాను చిత్రంలోనూ గౌరీ జీ కిషనే నటించింది.

96 Fame Gouri G Kishan Little Miss Naina Movie Streaming Now on Etv Win OTT Full Details Here

ఇక గౌరీ జి కిషన్ హీరోయిన్ గా మారి సినిమాలు, సిరీసులు చేస్తూ బిజీగా ఉంది. ఈ క్రమంలోనే గౌరీ తాజాగా మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌ టైనర్ లిటిల్ మిస్ నైనా అనే చిత్రంలో నటించింది. ఇక ఈ చిత్రం ఇప్పుడు డైరెక్టుగా ఓటీటీలో సందడి చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ETV విన్‌ ఈ సినిమాను డిజిటల్ ప్రిమియర్ హక్కలను తీసుకుంది. ఇక ఈ సినిమా ఈటీవీ విన్ లోకి వచ్చింది.

96 Fame Gouri G Kishan Little Miss Naina Movie Streaming Now on Etv Win OTT Full Details Here

లిటిల్ మిస్ నైనా చిత్రంలో గౌరీ జి కిషన్ జోడిగా షేర్షా షెరీఫ్ నటించాడు. నూతన దర్శకుడు విష్ణు దేవ్ దర్శకత్వం వహించగా... ఈ చిత్రం మ్యూజికల్ రొమాన్స్ కథాంశంతో రాబోతుంది. నైనా పొట్టిగా (4 అడుగులు), అభిజిత్ పొడవుగా (6 అడుగులు) ఉండటంతో పొట్టి, పొడుగు కాన్సెప్ట్‌తో అందరినీ నవ్వించేలా ఉండబోతోందని తెలుస్తోంది.

అభిజిత్‌ కి సినిమా అంటే పెద్ద ప్యాషన్ కాగా... OCD సమస్య ఉన్న అమ్మాయికి చదువులంటే ప్రాణం. ఈ ఇద్దరి మధ్య ప్రేమ కథ ఎలా సాగింది? వచ్చిన సమస్యలు ఏంటి? అనేది ఎంతో వినోదభరితంగా ఈ చిత్రంలో చూపించారు. 96 ఫేమ్ గోవింద్ వసంత అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ల్యూక్ జోస్ కెమెరా, సంగీత్ ప్రతాప్ ఎడిటింగ్ బాధ్యతలు చెపట్టగా.. సుతిన్ సుగతన్ నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇక ఈ చిత్రం జనవరి 25 నుంచి ETV విన్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక గౌరీ జి కిషన్ విషయానికి వస్తే.. తెలుగులో శ్రీదేవి శోభ‌న్ బాబు త‌ర్వాత అంతగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం త‌మిళం, మ‌ల‌యాళంలో మాత్రం ఈ బ్యూటీ బిజీగా ఉంది. గ‌త ఏడాది త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో ఐదు సినిమాలు చేయగా... మ‌ల‌యాళంలో ల‌వ్ అండ‌ర్ క‌న‌స్ట్ర‌క్ష‌న్ వెబ్ సిరీస్ తో బిజీగా ఉంది. ఇక ఈ భామ నటించిన ఈ లేటెస్ట్ మ్యూజికల్ రొమాన్స్ ను ఇంట్లోనే మీ ప్రియమైన వారితో కలిసి చూసి ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X