వెబ్ సిరీస్ చూసి 13 కోట్లు లూటీ.. రియల్ లైఫ్ రాబరీ.. ఆ ఓటీటీ సిరీస్‌ను మీరు చూశారా?

ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో పలు సినిమాలు లేదా వెబ్ సిరీస్ లు లాంటి ఆడియెన్స్ కి ఒకింత ప్రేరణను కలిగిస్తాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సిరీస్ లు సినిమాలు నుంచి మంచి మెసేజ్ లు లాంటివి ఫాలో అవ్వరు కానీ జనాలు నెగిటివ్ అంశాలను మాత్రం గట్టిగానే ఫాలో అవుతారని చెప్పవచ్చు. వార్తల్లో చాలా వరకు పలు ఘటనలని యూట్యూబ్ లో కూడా చూసి ప్రయత్నించిన దాఖలాలు కూడా అనేకం కనిపిస్తాయి.

ఇపుడు ఇలాంటి ఓ షాకింగ్ అండ్ థ్రిల్లింగ్ దొంగతనం ఘటన కోసం బయటకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఓటిటి ప్రపంచంలో వరల్డ్ వైడ్ గా హిట్ అయ్యిన పలు వెబ్ సిరీస్ లు ఉన్నాయి. మరి ఈ వెబ్ సిరీస్ లలో ఒకదాన్ని చూసి ఓ ఆరుగురు పక్కా పన్నాగం వేసి ఏకంగా 13 కోట్లు విలువ చేసే బంగారాన్ని అది కూడా బ్యాంకు నుంచి చాకచక్యంగా కొట్టేసి బయటకి వెళ్లిపోవడం వైరల్ గా మారింది.

a gang inspired by money heist and looted 13 crore in bank

ఇదంతా ఎక్కడో కూడా కాదు మన సౌత్ లోనే కర్ణాటకలో జరిగిందట. కాగా కర్ణాటకకి చెందిన విజయ్ కుమార్ అనే ఒకతను మొత్తం ఆరుగురు గ్యాంగ్ ని సెట్ చేసుకొని కర్ణాటక, దేవాంగరీ ప్రాంతానికి చెందిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లోనే లూటీ చేశారట. షాకింగ్ గా ఈ లూటీని గత ఏడాది 2024లో అక్టోబర్ నెలలో చేస్తే ఇపుడు బయటకి వచ్చింది.

ఇంతకీ వీరు ఏ వెబ్ సిరీస్ ఆధారంగా దొంగతనం చేసారో చెప్పలేదు కదా. వరల్డ్ పాపులర్ ఓటిటి యాప్ నెట్ ఫ్లిక్స్ లో సంచలన విజయం అందుకున్న వెబ్ సిరీస్ మనీ హెయిస్ట్ వీరికి ప్రేరణగా నిలిచింది అట. అందులో ప్రొఫెసర్ అండ్ గ్యాంగ్ అంతా కలిసి ఎన్నో బ్యాంకులు ఎలా లూటీ చేస్తారో అనేది అందరికీ తెలుసు. ఇలా మంచి థ్రిల్లింగ్ గా సాగే ఈ వెబ్ సిరీస్ ఓటిటిలో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద హిట్.

మరి దీనిని చూసే కర్ణాటక బ్యాంకుకి ఈ ఆరుగురు కన్నం వేసారట. ఆ బ్యాంకులో చొరబడి 17 కిలోలకి పైగా బంగారాన్ని ఎత్తుకుపోయారట. దీని విలువ 13 కోట్లకి పైగానే అని తెలుస్తుంది. కానీ ఫైనల్ గా ఈ గ్యాంగ్ ని పోలీస్ వారు తమిళనాడులో పట్టుకొని ఈ కేసుకి ఒక ఎండ్ కార్డు వేసినట్టుగా తెలిసింది. మొత్తానికి మాత్రం ఈ సంచలన వెబ్ సిరీస్ ఎఫెక్ట్ ఈ రేంజ్ లో ఉందని చెప్పవచ్చు.

ఆ సిరీస్ లో చూపించినట్టే వీరెలా ప్లానింగ్ వేసుకొని కొట్టేసారో వారికే తెలియాలి. కాగా ఈ మధ్య కాలంలోనే ఎక్కడో కూడా కాదు హైదరాబాద్ లోనే జరిగిన ఓ దారుణమైన హత్యా ఘటన మలయాళంలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ నజ్రియా ఫహద్ నటించిన 'సూక్ష్మ దర్శిని' చూసి చేసానని చెప్పిన మాటలు కూడా విని ఒకింత మూవీ లవర్స్ ఖంగుతిన్నారు. మరి వీటిని చూసి ఎంజాయ్ చేయడం ఏమో కానీ రియల్ లైఫ్ లో కూడా అప్లై చేసి కొందరు తమ మీదకే తెచ్చుకుంటున్నారు.

More from Filmibeat

Read more about: money heist netflix gold
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X