ఓటిటిలో "భారతీయుడు 2" కి షాక్.. వారు పెద్ద ట్విస్టే ఇచ్చారుగా..
ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో అంచనాలు పెట్టుకొని రిలీజ్ కి వచ్చిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. గడిచిన కొన్నేళ్లలో చూసినట్టు అయితే వరుసగా పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేసాయి కానీ ఈ ఏడాదిలో మాత్రం ఒకింత తక్కువే వచ్చాయని చెప్పాలి. మెయిన్ గా మన తెలుగు నుంచి ఈ ఏడాది వచ్చిన పాన్ ఇండియా సినిమాలు సెన్సేషనల్ సక్సెస్ సాధించాయి.
కానీ ఈ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం అనుకున్న రేంజ్ హిట్ కాలేక చతికిల పడ్డాయి. కాగా ఈ ఏడాది జూన్ లో పాన్ ఇండ యా బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ నటించిన "కల్కి 2898 ఎడి" థియేటర్స్ లో వచ్చి మాసివ్ హిట్ అయ్యింది. కాగా ఈ సినిమాలో విలన్ గా కనిపించిన ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా చేసిన మరో చిత్రం "భారతీయుడు 2" పాన్ ఇండియా రిలీజ్ కి వచ్చింది.

కాగా ఈ చిత్రం దర్శకుడు శంకర్ ట్రేడ్ మార్క్ తో వచ్చినప్పటికీ అనుకున్న రేంజ్ వసూళ్లు ఈ చిత్రం రాబట్టలేకపోయింది. పెట్టిన బడ్జెట్ జరిగిన బిజినెస్ లో కూడా సగాన్ని రాబట్టిన దాఖలాలు లేవు. దీనితో బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ గా నిలిచిపోయిన ఈ చిత్రానికి ఇప్పుడు మరో షాకింగ్ ట్విస్ట్ తగిలినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఇది మాత్రం చిత్ర యూనిట్ కి మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టే అని అనుకోవాలి.
ఇంతకీ అసలు మేటర్ ఏమిటంటే పలు చిత్రాలు ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఓటిటిలో ముందే అగ్రిమెంట్ లు అయ్యిపోతాయి. అలాగే భారీ సంస్థ నెట్ ఫ్ ిక్స్ తో భారతీయుడు 2 కి ఒప్పందం ఎప్పుడో అయిపోయింది. కానీ ఇటీవల ఓటిటి సంస్థలు కొన్ని కొత్త నియమాలు తెచ్చుకున్నాయి. వారు తీసుకున్న సినిమా ఒకవేళ ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు రాబట్టి హిట్ అయితే తాము కూడా అప్పుడుకి ఇచ్చిన దానికంటే మరింత ధర ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.
కానీ ఒకవేళ సినిమా ప్లాప్ అయితే మాత్రం ముందు చెప్పిన అమౌంట్ ఇవ్వడం పక్కన ఉంచితే ఆ అగ్రిమెంట్ అమౌంట్ లో కొత్త కూడా వేస్తున్నారట. ఇలానే ఇప్పుడు భారతీయుడు 2 ఓటిటి డీల్ కి జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి ముందు కొంత మొత్తంలో డీల్ అయిపోయింది. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. సో నెట్ ఫ్లిక్స్ వారు సినిమా నిర్మాణ సంస్థతో మరోసారి సంప్రదింపులు చేస్తున్నారట.
ఆల్రెడీ ఇవ్వాల్సిన అమౌంట్ తగ్గించడమో లేదా ఆల్రెడీ ఇచ్చేసి ఉంటే మళ్ళీ కొంత వెనక్కి ఇమ్మనడమో చేస్తున్నారట. లేని పక్షంలో భారతీయుడు 2 ఓటిటి రిలీజ్ అనుమానమే అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఇది మాత్రం ఇండియన్ 2/ భారతీయుడు 2 ఓటిటి రిలీజ్ కోసం చూస్తున్న వారికి మేకర్స్ కి కూడా బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇక ఈ ఊహించని మలుపుతో అయితే ఈ సినిమాకి చిట్ట చివరిగా ఏమవుతుందో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











