ఓటీటీలోకి 150 కోట్ల సంచలన సినిమా.. గుండెను హత్తుకునే దీన్ని ఎక్కడ చూడాలంటే!

ఈ మధ్య కాలంలో ఇండియాలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీల కంటే మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా ఈ రెండు మూడు నెలల వ్యవధిలోనే అక్కడ ఇండస్ట్రీ హిట్ చిత్రాలు రూపొందాయి. అలాంటి వాటిలో 'ఆడుజీవితం' (The Goat life) సినిమా ఒకటి. ఇది నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయిపోయింది.

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ ప్రధాన పాత్రలో బ్లెస్సీ తెరకెక్కించిన సినిమానే 'ఆడుజీవితం'. కుటుంబ పోషణ కోసం ఓ యువకుడు సౌదీకి వెళ్లడం.. అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయి గొర్రెల కాపరిగా మారడం.. తర్వాత అతడు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు అనే కథతో ఇది తెరకెక్కింది. దీంతో ఈ చిత్రంపై ఆరంభంలోనే అందరిలో ఆసక్తి ఏర్పడ్డింది.

Aadujeevitham Movie Streaming on Disney plus Hotstar From May 26th

గుండెను హత్తుకునే కథాంశంతో రూపొందిన 'ఆడుజీవితం' మూవీ మార్చి 28వ తేదీన పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. దీనికి అన్ని వర్గాల ప్రేక్షకులు అదిరిపోయే స్పందనను అందించారు. ఫలితంగా ఈ చిత్రం ఏకంగా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసి టాప్ మూవీగా నిలిచింది. దీంతో మలయాళంతో పాటు చాలా భాషల్లో రికార్డులు క్రియేట్ చేసింది.

ఎమోషనల్ కాన్సెప్టుతో రూపొందిన 'ఆడుజీవితం' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి మంచి పోటీనే వస్తుందని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ సినిమాను సొంతం చేసుకుంది. ఇందుకోసం భారీ మొత్తాన్నే ముట్టజెప్పింది. ఇక, తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్‌పై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ఆడుజీవితం' మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని మే 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకు రాబోతుందని తెలిసింది. అంతేకాదు, ఇందులో ఈ చిత్రం ఏకంగా మూడు గంటలకు పైగా నిడివితో ప్రసారం కాబోతుందని ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Aadujeevitham Movie Streaming on Disney plus Hotstar From May 26th

ఇదిలా ఉండగా.. బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ఆడుజీవితం' (The Goat life) మూవీని బ్లెస్సీ, జిమ్మీ జీన్, స్టీవెన్ ఆడమ్స్‌లు నిర్మించారు. దీనికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇచ్చారు. ఇందులో అమలా పాల్ హీరోయిన్‌గా నటించగా.. కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్, శోభా మోహన్, తాలిబ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X