Laal Singh Chaddha's OTT రిలీజ్‌పై బాంబు పేల్చిన అమీర్ ఖాన్.. ఎప్పుడు రిలీజ్ అంటే?
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా చిత్రం రోజు రోజుకు అంచనాలు పెంచుతున్నది. లాక్డౌన్ కారణంగా పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్లు, ట్రైలర్లు ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్స్‌గా మారాయి. దాంతో ఈ సినిమా కోసం, థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్‌లో ఓటీటీ రిలీజ్ గురించి అమీర్ ఖాన్ బాంబు పేల్చారు. ఓటీటీ రిలీజ్ గురించి వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
దేశవ్యాప్తంగా చాలా సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అయిన వెంటనే ఓటీటీలోకి వస్తున్నాయి. అయితే అలా రావడం థియేట్రికల్ రిలీజ్‌పై దెబ్బ పడుతున్నాయి. అయితే లాల్ సింగ్ చడ్డా ఓటీటీ రిలీజ్ గురంచి మాట్లాడుతూ.. ఓటీటీలో రిలీజ్ కావడం వల్ల థియేటర్‌కు వెళ్లాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో తగ్గుతున్నది. నా సినిమాల విషయంలో థియేట్రికల్ రిలీజ్‌కు, ఓటీటీ రిలీజ్‌కు కనీసం ఆరు నెలల గ్యాప్ ఉండాలనే నిర్ణయాన్ని తీసుకొన్నాను.

అయితే నేను అనుకొన్నట్టు ఇండస్ట్రీ ఈ నిబంధనకు కట్టుబడి ఉంటుందా లేదా అనే వేచి చూడాల్సిందే. కానీ నేను మాత్రం 6 నెలల తర్వాత ఓటీటీలో నా సినిమాను రిలీజ్ చేస్తాను. నా సినిమాలో విషయంలో నేను కచ్చితంగా ఉంటాను అని అమీర్ ఖాన్ తెలిపారు.
ది ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్‌గా రూపొందిన లాల్ సింగ్ చడ్డా చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. చిరంజీవి ఈ సినిమాను తెలుగులో సమర్పిస్తున్న తరుణంలో మరింత క్రేజ్ పెరిగింది. ఆగస్టు 11వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వస్తున్నది.


Click it and Unblock the Notifications











