Aamir Khan నేను ముస్లింను.. రెండు చేతులు జోడించి నమస్కరించలేను.. కానీ!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇస్లాం మతానికి చెందిన వాడైనప్పటికీ.. ఇతర మతాలను గౌరవిస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్‌ను, ఫాలోయింగ్‌ను సంపాదించుకొన్నాడు. అయితే తాజాగా ఇతర మతంపై తనకు గౌరవం ఏర్పడటానికి సిక్కులు అనుసరించిన విధానం గురించి అమీర్ ప్రస్తావించారు. తాజా కపిల్ శర్మ కామెడీ నైట్స్ షోలో ఆయన మాట్లాడుతూ..
దంగల్ సినిమా షూటింగు కోసం పంజాబ్‌కు వెళ్లాం. అప్పుడు పంజాబ్ వాసుల్లో ఎంత ప్రేమ ఉంటుందో నాకు అర్దమైంది. వారు వెలకట్టలేని ప్రేమను నాపై కురిపించారు. అది చూసి నా గుండె చలించిపోయింది. అప్పటి వరకు పంజాబ్ ప్రజలు నిజాయితీ, అభిమానం గురించి విన్నాను. కానీ ప్రత్యక్షంగా ఆ సమయంలో చూసి నేను ఆశ్చర్యపోయాను అని అమీర్ ఖాన్ చెప్పారు.

దంగల్ సినిమా షూట్ కోసం ఓ గ్రామం వెళ్లాల్సి వచ్చింది. నేను బస చేసిన చోట నుంచి ఓ గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆ గ్రామం నుంచి ఉదయం 6 గంటలకు వెళ్లి..సాయంత్రం 6 గంటలకు తిరిగి వెళ్లే వాడిని. ఆ సమయంలో గ్రామస్థులందరూ రోడ్డుకు ఇరువైపులా నిలబడి.. చేతులు రెండు జోడించి నమస్కరించే వారు అమిర్ ఖాన్ తెలిపారు.
అయితే దాదాపు నెల రోజులపాటు ఆ గ్రామం వద్ద షూట్ చేశాం. ఉదయం వెళ్లేటప్పుడు.. సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు గ్రామస్థులందరూ వినమ్రంగా నమస్కరించారు. అయితే నేను ముస్లిం మతానికి చెందిన వాడిని. చేతులు జోడించి మొక్కడం మా ఆచారం కాదు. చేతులు చాచి నమస్కరించడం మా ఆచారం. కానీ ఆ నెల రోజుల్లో వారిని చూసి చేతులు జోడించి నమస్కరించే విధానం నేర్చుకొన్నాను. రెండు చేతులు జోడించి మొక్కడంలో ఉండే పవర్ నాకు అర్ధమైంది అని అమీర్ ఖాన్ తెలిపారు.

ఓ నటుడిగా అలాంటి గౌరవం లభించడం గొప్ప అవకాశం.. గర్వంగా ఫీలవుతాను. కుల మతాలకతీతంగా ప్రేమను సొంతం చేసుకొన్నాను. ముఖ్యంగా సిక్కుల్లో ఉండే ప్రేమను దంగల్ సినిమా షూటింగ్‌లో చూశాను. భేషరతుగా ఎలాంటి ప్రేమను కురిపిస్తారో ప్రత్యక్షంగా చూశాను అని అమీర్ ఖాన్ అన్నారు.


Click it and Unblock the Notifications











