ఓటీటీలోకి 100 కోట్ల కలెక్షన్ల కామెడీ యాక్షన్ మూవీ.. ఎక్కడ? ఎప్పుడు? చూడొచ్చంటే?
మలయాళ చిత్ర పరిశ్రమ వరుస విజయాలతో మంచి జోరు మీద ఉంది. 2024 ఆరంభం నుంచి సంచలన విజయాలతో మాలీవుడ్ శుభారంభం చేసింది. ఈ సంవత్సరం ఆరంభం నుంచి బ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, గోట్ ఆఫ్ లైఫ్ (ఆడు జీవితం) లాంటి సినిమాలు రికార్డు కలెక్షన్లను సాధించాయి. వీటన్నిటి మధ్య మరో బ్లాక్ బస్టర్ చిత్రం ఆవేశం సినిమా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాస్తున్నది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వివరాల్లోకి వెళితే..
మలయాళంలో యువ దర్శకుడు మాధవన్ జితు దర్శకత్వంలో ప్రముఖ నటుడు ఫాహద్ ఫాజిల్ నటించి నిర్మించిన చిత్రం ఆవేశం.ఈ సినిమాకు నిర్మాతగా ఆయన సతీమణి నజ్రియా నజీం నిర్మాతగా మారారు. ఆశీష్ విద్యార్థి, సాజిన్ గోపి, మన్సూర్ ఆలీ ఖాన్ తదిరులు నటించారు. ఏప్రిల్ 11వ తేదీన రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది.

ఆవేశం సినిమాను సుమారుగా 50 కోట్ల రూపాయలతో చాలా రిచ్‌గా ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించారు. ఈ సినిమా 35 కోట్ల రూపాయలు వస్తే బ్రేక్ ఈవెన్‌గా నిర్ణయించారు. అయితే ఈ సినిమా తొలివారమే భారీ లాభాలను సాధించింది. ఈ సినిమా రెండు వారాల్లో 110 కోట్లకపైగా కలెక్షన్లు సాధించింది. కేరళలో 70 కోట్లకుపైగా గ్రాస్, ఓవర్సీస్‌లో 40 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.
ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ కూడా భారీ రేటు పలికింది. ప్రముఖ ఓటీటీ ఛానెల్స్ పోటీ పడినప్పటికీ.. టాప్ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీ హక్కులను సొంతం చేసుకొ్నది. ఈ సినిమా కోసం జరిగిన ఒప్పందంలో భాగంగా ఓటీటీ రిలీజ్‌కు ప్లాన్ చేశారు.

ఇక ఆవేశం సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు సిద్దం చేశారు. ఇప్పటి వరకు కేవలం మలయాళంలోనే రిలీజైన ఈ సినిమాను పలు భాషల్లో రిలీజ్ చేసేందుకు రెడీ చేశారు. ఈ సినిమాను మే 17వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.


Click it and Unblock the Notifications











