OTT: ఓటిటిలోకి కమిటీ కుర్రోళ్ళతోపాటు ఆయ్.. ఎప్పుడు ఎందులో అంటే?

ప్రెజెంట్ ఉన్నటువంటి ఆధునిక ఎంటర్టైన్మెంట్ రంగంలో ఆడియెన్స్ ని అలరించేందుకు అనేక ఓటిటి ప్లాట్ ఫామ్ లు ఏ రేంజ్ లో పోటీ పడుతున్నాయి అనేది అందరికీ తెలుసు. అలా వరల్డ్ వైడ్ గా ప్రతి వారం కూడా కొత్త కొత్త కంటెంట్ తో ఆడియెన్స్ ని అలరించేందుకు వారు వస్తుంటారు. థియేటర్స్ లో ఇలా కొత్త సినిమాలు రావడం ఆలస్యం అవి వచ్చిన నెల లోపే ఓటిటిలో దర్శనం ఇస్తున్నాయి.

కాగా మన దేశంలో అయితే ఈ తరహా ట్రెండ్ మరింత ఊపందుకుంది. చిన్న సినిమా లేదు పెద్ద సినిమా లేదు. ఈ మధ్య కాలంలో అన్ని సినిమాలు దాదాపు నెల లోపే వచ్చేసినవి ఇలా మన తెలుగు సినిమాలు కూడా చాలా ఉండగా ఇప్పుడు గత నెలలో రిలీజ్ అయ్యిన పలు చిత్రాలు అయితే నెల కాదు కదా మూడు వారాల్లో కూడా వచ్చినవి ఉన్నాయి.

aay movie ott release date announced and its making pan south entry

ఇక ఆ చిత్రాల్లో నేడే మాస్ మహారాజ రవితేజ నటించిన చిత్రం మిస్టర్ బచ్చన్ పై పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సెప్టెంబర్ 12న తీసుకొస్తున్నట్టుగా ఫిక్స్ చేసేసారు. మరి ఇదే డేట్ లో గత మిస్టర్ బచ్చన్ కంటే ఓ వారం ముందు వచ్చిన యూత్ హిట్ చిత్రం "కమిటీ కుర్రోళ్ళు" కూడా ఫిక్స్ అయ్యింది. అయితే దీనిని ఈటీవీ విన్ వారు స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా ఫిక్స్ చేశారు.

మరి ఇదే యూత్ కాన్సెప్ట్ తో వచ్చి మరో హిట్ గా నిలిచిన చిత్రం మళ్ళీ ఇదే డేట్ లో స్ట్రీమింగ్ కి రావడానికి సిద్ధం అయ్యింది. కాగా ఆ చిత్రం ఏదో కాదు ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా నటించిన ఎంటర్టైనర్ చిత్రం "ఆయ్". కమిటీ కుర్రోళ్ళు తరహాలో ఇది కూడా గోదావరి జిల్లాల నేపథ్యంలోనే తెరకెక్కినప్పటికీ ఇది కూడా మంచి వసూళ్లు సాధించి హిట్ అయ్యింది.

కాగా ఈ చిత్రం కూడా ఇప్పుడు సరిగ్గా కమిటీ కుర్రోళ్ళు తోనే ఈ యూత్ ఫుల్ డ్రామా కూడా రావడానికి సిద్ధం అయ్యింది. కాగా ఈ సినిమాని కూడా మిస్టర్ బచ్చన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వాళ్ళే సొంతం చేసుకోగా ఈ చిత్రంని కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీనితో ఈ సెప్టెంబర్ 12 న రిలీజ్ కి రాబోతుంది. మరి నెట్ ఫ్లిక్స్ వారు ఒక్క హిందీ మినహా మిగతా సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ కి తీసుకొస్తునట్టుగా కన్ఫర్మ్ చేశారు.

దీనితో ఈ చిత్రం కూడా వచ్చే వారం ఓటిటి అడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ రాబోతుంది అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో కొత్త హీరోయిన్ నయన సారిక పరిచయం కాగా ఈమెకి తన మొదటి సినిమా తోనే మంచి మార్కులు కూడా పడ్డాయి. మరి ఈ సినిమాని దర్శకుడు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. అలాగే కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య హీరో ఫ్రెండ్స్ గా కీలక పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X