8 నెలల తర్వాత OTTలోకి రాబోతున్న అచ్చమైన తెలంగాణ పొలిటికల్ డ్రామా.. ఎలా చూడాలంటే?

ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా చాలా ఎక్కువ అయిపోయింది. అనేక అద్భుతమైన సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. థియేటర్లలోకి వచ్చి ఏళ్ల గడిచిన సినిమాలన నుంచి నెల రోజుల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇలా ఇప్పటికే అనేక కొత్త, పాత చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో సందడి చేస్తుండగా.. మరో క్రేజీ తెలంగాణ పొలిటికల్ డ్రామా ఫిల్మ్ ఓటీటీలోకి రాబోతుంది. అయితే థియేటర్లలో విడుదల అయిన దాదాపు 8 నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అయింది. ఆ సినిమా ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అభయ్ బేతిగంటి దర్శకత్వంలో దాదాపు 8 నెలల క్రితం వచ్చి పొలిటికల్ డ్రామా మూవీయే రామన్న యూత్. ఫైర్ ఫ్లై ఆర్ట్స్, మాడ్ గుడ్ క్రియేటివ్ రైటింగ్స్ బ్యానర్‌లపై నిర్మించిన ఈ సినిమాకు అభయ్ నవీన్ తొలిసారిగా దర్శకత్వం వహించాడు. అభయ్ నవీన్, అమూల్య రెడ్డి, అనిల్‌ గీల, శ్రీకాంత్ అయ్యంగర్, తాగుబోతు రమేశ్, బన్నీ అభిరామ్, విష్ణు, శ్రీకాంత్ అయ్యంగార్, యాదమ్మ రాజు, రోహిణి, మనోజ్ ముత్యం, జె జగన్ యోగిరాజ్, బన్నీ అభిరన్ వంటి వాళ్లు ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు.

Abhay Bethiganti Ramanna Youth Movie OTT Streaming Details Here

అలాగే ఈ రామన్న యూత్ సినిమాకు కమ్రాన్‌ సంగీతం సమకూర్చగా.. ఫహద్‌ అబ్దుల్‌ మజీద్‌ సినిమాటోగ్రఫీ అందించాడు. అలాగే రూపక్ రొనాల్డ్ సన్, అభయ్ నవీన్ లే ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. ఇలా అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా గతేడాది సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది. అయితే చిన్న సినిమా కావడంతో.. పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది. అలాగే ఆ సమయంలో పెద్ద పెద్ద చిత్రాలు విడుదల కాగా థియేటర్ల వద్ద భారీగా వసూళ్లు రాబట్టులోక పోయింది.

అయతే థియేటర్లలో విడుదల అయిన దాదాపు 8 నెలల తర్వాత ఈ తెంలగాణ పొలిటికల్ డ్రామా మూవీని ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈక్రమంలోనే సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ నేరుగా ఈ చిత్రాన్ని మే 30వ తేదీ నుంచి విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. ఎక్స్ వేదికగా రామన్న యూత్ సినిమా అందుబాటులోకి రాబోతున్నట్లు ప్రకటించింది. ఈ క్రేజీ మూవీ ఓటీటీలోకి వస్తుండగా.. అంతా తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాను ఓటీటీలో చూడాలని ఫిక్స్ అవుతున్నారు. మరి మీరు కూడా ఈ అద్భుతమైన పొలిటికల్ డ్రామాను ఓటీటీ వేదికగా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X