ఓటీటీలోకి భయపెట్టే దెయ్యం సినిమా.. 130 కోట్ల ఈ మూవీని చూడడం ఎలా అంటే!

సాధారణంగా సినీ రంగంలో ఎన్నో జోనర్లు ఉన్నా.. అందులో కొన్నింటిలో తెరకెక్కే చిత్రాలకు మాత్రమే ప్రత్యేకమైన ఆదరణ లభిస్తుంటుంది. అందులో హర్రర్ జోనర్ ఒకటి. చాలా కాలం నుంచే ఈ తరహాలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో ఇప్పటికీ ఇవి భారీగా వస్తూనే ఉన్నాయి. అలా ఇటీవలే బాలీవుడ్‌లో వచ్చిన చిత్రమే 'ముంజ్య' (Munjya).

అభయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన సినిమానే 'ముంజ్య'. ఆదిత్య సర్పోట్దర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హర్రర్ స్టోరీతో తెరకెక్కింది. దీంతో ఈ సినిమా ప్రచార చిత్రాలు బాగా ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ దెయ్యం సినిమాను జూన్ 7వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

Abhay Verma Starrer Munjya Movie Streaming on Hotstar From August

అభయ్ వర్మ హీరోగా పరిచయం అయిన 'ముంజ్య' సినిమాకు మొదట్లోనే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే రివ్యూలు కూడా మంచిగా లభించాయి. దీంతో ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభించింది. ఫలితంగా ఇది ఫుల్ రన్‌లో ఈ తక్కువ బడ్జెట్ సినిమా ఏకంగా రూ. 130 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది.

భయపెట్టే దెయ్యం కాన్సెప్టుతో రూపొంది విడుదలకు ముందే అంచనాలను ఏర్పరచుకోవడంతో 'ముంజ్య' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి భారీ స్థాయిలోనే పోటీ వచ్చింది. ఈ పరిస్థితుల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ మూవీ హక్కులను కొనుక్కుంది. ఇందుకోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్ని ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియా తెలిపింది.

Abhay Verma Starrer Munjya Movie Streaming on Hotstar From August

రెండు కాలాలకు సంబంధించిన కథతో రూపొందిన 'ముంజ్య' మూవీపై ఓటీటీ స్ట్రీమింగ్‌పై చాలా రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ప్రకటన చేసింది. అందులో ఈ చిత్రాన్ని ఆగస్టు నెలలోనే అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలిపింది. దీంతో థియేటర్లలో ఈ సినిమాను మిస్సైన వాళ్లంతా దీని కోసం వేచి చూస్తున్నారు.

ఇదిలా ఉండగా.. క్రేజీ కాన్సెప్టుతో వచ్చిన 'ముంజ్య' మూవీని మడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్‌ నిర్మించారు. ఈ చిత్రంలో షర్వారీ హీరోయిన్‌గా నటించగా.. మోనా సింగ్, సత్యరాజ్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి సచిన్ జిగర్, జస్టిన్ సంగీతాన్ని అందించారు.

More from Filmibeat

Read more about: munjya abhay verma munjya ott
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X