ఓటీటీలోకి వచ్చేసిన దెయ్యం సినిమా.. ఒంటరిగా చూశారో అంతే సంగతులు!
ఒకప్పుడు హర్రర్ సినిమాలు అంటే అంతగా వచ్చేవి కాదు. కానీ, ఇప్పుడు మాత్రం ప్రేక్షకుల అభిరుచిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. దీంతో అలాంటి సినిమాలనే ఎక్కువగా చూస్తున్నారు. అందుకే అన్ని భాషల్లోనూ భయపెట్టే కాన్సెప్టులతో చిత్రాలు తెరకెక్కుతోన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ మధ్యన హర్రర్ సినిమాలు చాలా వచ్చాయి. అలాంటి ఓ మూవీనే 'ముంజ్య'.
అభయ్ వర్మ హీరోగా పరిచయం అయిన సినిమానే 'ముంజ్య'. ఆదిత్య సర్పోట్దర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హర్రర్ స్టోరీతో తెరకెక్కింది. దీంతో ఈ సినిమా ప్రచార చిత్రాలు బాగా ఆకట్టుకున్నాయి. ఫలితంగా ఈ చిత్రంపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ దెయ్యం సినిమాను జూన్ 7వ తేదీన గ్రాండ్‌గా విడుదల అయింది.

హర్రర్ కాన్సెప్టుతో తెరకెక్కిన 'ముంజ్య' సినిమాకు మొదట్లోనే మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా రివ్యూలు కూడా మంచిగా లభించాయి. దీంతో ఆడియెన్స్ నుంచి ఈ మూవీకి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా సొంతం అయింది. ఫలితంగా తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ. 130 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సెన్సేషన్ అయింది.
వణికించే స్టోరీతో రూపొంది విడుదలకు ముందే అంచనాలను పెంచుకోవడంతో 'ముంజ్య' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థల నుంచి అదిరిపోయే రీతిలో పోటీ వచ్చింది. ఈ పరిస్థితుల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఈ మూవీ హక్కులను దక్కించుకుంది. ఇందుకోసం సదరు సంస్థ చిత్ర నిర్మాతలకు భారీ మొత్తాన్ని ఇచ్చినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది.
అదిరిపోయే ట్విస్టులు, సీన్లతో సాగే 'ముంజ్య' మూవీపై ఓటీటీ స్ట్రీమింగ్‌పై డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ ఎప్పుడో ప్రకటన చేసింది. కానీ, దీన్ని మాత్రం ప్రసారం చేయలేదు. దీంతో ఈ చిత్రం కోసం వేచి చూసిన వాళ్లంతా నిరాశ పడిపోయారు. ఈ పరిస్థితుల్లో ఆగస్టు 25 నుంచి ఈ చిత్రాన్ని హాట్‌స్టార్ అందుబాటులోకి తెచ్చింది. ఇందులో కూడా దీనికి భారీ స్పందన లభిస్తోంది.

ఇదిలా ఉండగా.. భయపెట్టే కాన్సెప్టుతో రూపొందిన 'ముంజ్య' మూవీని మడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ చిత్రంలో షర్వారీ హీరోయిన్‌గా నటించగా.. మోనా సింగ్, సత్యరాజ్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీకి సచిన్ జిగర్, జస్టిన్ సంగీతాన్ని సమకూర్చారు.


Click it and Unblock the Notifications











