OTTలోకి మరో సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్.. కడుపుబ్బా నవ్వుకోవాలంటే డోంట్ మిస్!
ఇప్పటికే ఓటీటీలో కడుపుబ్బా నవ్వించే కామెడీ ఎంటర్టైనర్ వైవా హర్ష నటించిన సుందరం మాస్టార్ సినిమా వచ్చేసింది. ఇప్పుడు మరో కామెడీ ఎంటర్టైనర్ ఓటీటీలోకి రాబోతుంది. అదేంటో కాదు.. మస్త్ షేడ్స్ ఉన్నాయి రా సినిమా. అభినవ్ గోమటం నటించి ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ఇప్పటికే అభినవ్ సేవ్ ది టైగర్స్ సినిమాతో సూపర్ హిట్టు కొట్టాడు. ఆ సినిమా ఓటీటీలో సందడి చేస్తుండగానే.. మరో సినిమా రాబోతుంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
కౌశిక్ గా గుర్తింపు...:అభినవ్ గోమఠం.. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఇక మళ్లీ రావా చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది అనే చిత్రంతో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతోనే ఆయన లైమ్ లైట్ లోకి వచ్చాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో అభినవ్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించాడు. ఇక ఆయన క్యారెక్టర్ కౌశిక్ పేరు ఇప్పటికి గుర్తుండిపోయింది.

ఆ డైలాగ్ తో ఫేమస్...:ఈ సినిమాలో మస్తు షేడ్స్ రా నీలో.. కమల్ హాసన్ అన్న డైలాగ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. ఇప్పటికీ ఈ డైలాగ్ ను మీమర్స్ వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇదే డైలాగ్‌తో సినిమా చేసి సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అభినవ్ గోమఠం. మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా గత నెల 23న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వులు పుట్టించిన ఈ చిత్రం... బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.
కామెడీ ఎంటర్ టైనర్ తో...:ఇక ఈ సినిమాలో అభినవ్ సరసన వైశాలి రాజ్ నటించి మెప్పించింది. వంశీ నందిపాటి సమర్పణలో కాసుల క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద ఆరేం రెడ్డి, ప్రశాంత్, భవాని కాసుల ఈ చిత్రాన్ని సంయుక్తంగా రూపొందించారు. ఈ చిత్రానికి తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహించగా.. తరుణ్ భాస్కర్, అలీ రెజా, నిళ్ గళ్ రవి, రాకెట్ రాఘవ, జ్యోతి రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రంగా మెప్పించిన ఈ చిత్రం తొలి రోజే మంచి కలెక్షన్లను వసూళ్లు చేసింది.

ఓటీటీలో చూసేయండి...:చిన్న సినిమాగా వచ్చిన మస్త్ షేడ్స్ ఉన్నాయి రా చిత్రం సుమారు ఐదు కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది.. ఈ మూవీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేయగా... మార్చి 29 నుండి స్ట్రీమింగ్ కాతోతుందని తెలుస్తోంది. మరి ఈ కామెడీ ఎంటర్టైనర్ ను మీరు థియేటర్లలో మిస్ అయితే.. ఓటీటీలో ఈ వీకెండ్ కు మంచి ఛాయిస్. ఇంట్లోనే కలిసి ఈ సినిమాను చూసేయండి.


Click it and Unblock the Notifications











